పుష్ప 2 హిట్ వెనుక ఈ అమ్మాయి...ఈ అందాల తార రెమ్యునరేషన్ ఎంతంటే?
అనుకోకుండా హిట్ అయిన పుష్ప సినిమా కథతో... సుకుమార్ పార్ట్ 2 తీశారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీన రాత్రి 9:30 ప్రాంతంలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా చూసేందుకు వచ్చినా ఓ మహిళ తోక్కిసలాటలో మరణించిన సంగతి తెలిసిందే. ఇంతటి స్థాయిలో పుష్ప కోసం... క్రౌడ్ వస్తున్నారు. అయితే ఈ సినిమాలో అనసూయ లాంటి కీలక నటీనటులు ఉన్నప్పటికీ...పావని అనే అమ్మాయి క్యారెక్టర్ మాత్రం చాలా స్పెషల్.
ఈ సినిమాలో ఆమె హైలెట్ అయ్యారు. ఆమెతోనే సినిమా లో కీలక మలుపులు కూడా ఉంటాయి. అల్లు అర్జున్ ను ఈ సినిమాలో బాబాయి అని పిలుస్తుంది పావని. మరి అలాంటి పావని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవంగా ఈ బ్యూటీ... ఇప్పటికే పలు సినిమాలలో హీరోయిన్గా చేసింది. పరేషాన్, పైలం పిలగా అనే రెండు సినిమాల్లో పావని కనిపించి మెరిసింది. ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాకపోయినా పావనికి మంచి మార్కులే పడ్డాయి.
ముఖ్యంగా పరేషాన్ సినిమాలో... సమోసా డైలాగ్ చెప్పి బాగా పాపులర్ అయింది పావని. హిట్ 2 సినిమాలో కూడా మెరిసింది. అటు పుష్ప గాడి మొదటి భాగంలో కొంచెం సేపు కనిపించిన ఈ బ్యూటీ... రెండవ పార్ట్ లో మాత్రం అనసూయ కంటే ఎక్కువ సీన్లలో మెరిసింది. ఇక పుష్ప 2 సినిమాలో పావని నటించినందుకు దాదాపు రూ.50 లక్షల వరకు ఇస్తున్నారట.