ఇండియాలో నంబర్ వన్ హీరో బన్నీనే.. ఇంతకు మించిన ఆధారాలు అవసరమా?

Reddy P Rajasekhar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. బన్నీ పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమాకు బన్నీకి రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కింది. పుష్ప ది రూల్ సినిమాకు ఈ ఏరియా ఆ ఏరియా అనే తేడాల్లేకుండా అన్ని ఏరియాలలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండియాలో నంబర్ వన్ హీరో బన్నీనే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.
 
బన్నీ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఇంతకు మించిన ఆధారాలు అవసరం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో అద్భుతంగా నటించడం కూడా సినిమాకు ప్లస్ అవుతోంది. పుష్ప2 సినిమా కమర్షియల్ గా సుకుమార్ ఇమేజ్ ను సైతం ఎన్నో రెట్లు పెంచిందని చెప్పడంలో ఎలాంటి అందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. దర్శకుడు సుకుమార్ ఖాతాలో ఈ సినిమాతో వరుసగా నాలుగు విజయాలు చేరాయి.
 
నాన్నకు ప్రేమతో సినిమా నుంచి సుకుమార్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సుకుమార్ ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. అద్భుతమైన ఎలివేషన్ సీన్లతో పుష్ప ది రూల్ తెరకెక్కించడం సినిమాకు ప్లస్ అయింది. బుక్ మై షోలో, ఇతర టికెటింగ్ యాప్స్ లో బన్నీ హవా కొనసాగుతోంది. అల్లు అర్జున్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.
 
పుష్ప ది రూల్ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఆకట్టుకుంది. టామ్ అండ్ జెర్రీలా బన్నీ షెకావత్ మధ్య వచ్చే సీన్లు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. షెకావత్ పాత్రను ఒక విధంగా సైకోను తలపించేలా సుకుమార్ తీర్చిదిద్దారు. పుష్ప ది రూల్ సక్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి. బన్నీ బాక్సాఫీస్ వద్ద మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: