' పుష్ప 2 ' పై మెగా ఎఫెక్ట్ అక్కడ గట్టిగానే పడిందే...!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహార శైలి ప్రవర్తన మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చటం లేదు అనేది ఓపెన్ సెక్రెటరీ. మొదటి నుంచి బన్నీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు మెగా అభిమానులు. ఎన్నికల సమయంలో బన్నీ చేసిన నంద్యాల పర్యటన పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత తనకు నచ్చితే ఎవరైనా వస్తా ఎక్కడున్నా వస్తా అంటూ బన్నీ కామెంట్ చేశారు. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ ముందు బన్నీ చేసిన ప్రమోషన్లలో ఎక్కడ మెగా ప్రస్తావన రాకుండా చూడటం మెగా అభిమానులకు ఇంకా ఆగ్రహం తెప్పించింది. ఇలాంటి నేపథ్యంలో పుష్ప 2 సినిమాపై మెగా అభిమానులు అప్రకటిత బ్యాన్ విధించారని మాట అందరికీ తెలిసిందే కొన్ని మెగా అభిమాన సంఘాలు సమావేశమై పుష్ప 2 సినిమాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
నిజానికి ఈ ఎఫెక్ట్ ఏపీలో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలలో కనిపించింది అక్కడ ప్రీమియర్లకు చాలా వరకు థియేటర్లు ఫుల్ కాలేదు .. అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడం చాలాచోట్ల బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేశారు అనేది వాస్తవం. దీనికి రెండు కారణాలు కూడా ఉన్నాయి. టికెట్ రేటు సామాన్యుడు కొనేలా లేదు. 800 పెట్టి టిక్కెట్ కొనుక్కునే స్థోమత అందరికీ ఉండదు. మరో ప్రధాన కారణం మెగా అభిమాన సంఘాలు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం కూడా దీనిపై ప్రభావం చూపింది. అయితే తెలంగాణలో పుష్ప 2 ప్రీమియర్లు ఒక ఊపు ఊపాయి. అన్ని సెంటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. నిర్మాతలు హ్యాపీ.
కానీ ఈ ఊపు ఉభయ గోదావరి జిల్లాలలో కనిపించలేదు. మరీ ముఖ్యంగా బీసీ సెంటర్లలో చాలా చోట్ల ప్రీమియర్లు పడలేదు. టికెట్ రేట్ల కారణంగా షో లు క్యాన్సిల్ అయ్యాయని అనుకున్నా తమ విధించిన అప్రకటిత బ్యాన్ అసలు కారణం అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. దీంతో పాటు సినిమాలో బాసు డైలాగ్ ఇంకా మంట పుట్టించింది. ఈ డైలాగ్ ని వ్యతిరేకి మీడియా తమకి అనుకూలంగా మార్చుకునే ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే మిగిలిన చోట్ల ఎలా ఉన్నా గోదావరి జిల్లాలలో పుష్ప 2 వసూళ్ల పై ప్రభావం ఎక్కువగా చూపి అవకాశం కనిపిస్తోంది.