బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన భార‌తీయ చిత్రాలు.. పుష్ప 2 ఎన్నో స్థానం..!

Divya
తెలుగు సినీ పరిశ్రమలో కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతూ తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దేశ విదేశాలకు చాటుతూ ఉన్నారు.. అయితే ఇప్పటివరకు ఇండియా వైడ్ గా మన తెలుగు చిత్రాలు ఎలాంటి రికార్డులను తిరగరాసాయి ఇప్పుడు ఒక్కసారి చూద్దాం.. ముఖ్యంగా మొదటి డే కలెక్షన్స్ లో మన టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ ని సైత వెనక్కి నెట్టినట్లు తెలుస్తోంది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాల గురించి చూద్దాం..

1).RRR:
ఎన్టీఆర్, రామ్ చరణ్ , రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం RRR. ఈ సినిమా ఇండియన్ సినిమా లిస్టులో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబడిన చిత్రంగా మొదటి స్థానంలో ఉన్నది.. రూ.223 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పటివరకు ఈ సినిమా ఓపెనింగ్స్ ని ఏ చిత్రం బీట్ చేయలేకపోతున్నాయట. అయితే అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా ఈ రికార్డులను బ్రేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

2). బాహుబలి-2:
ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి-2 చిత్రం ఏకంగా 20018 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నది..

3). ప్రభాస్ కల్కి-2898AD:
ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన  ఈ సినిమా 191 కోట్ల ఓపెనింగ్స్తో మూడవ స్థానంలో ఉన్నది..

4). ప్రభాస్ సలార్:
ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే 178.7 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి నాలుగవ స్థానంలో ఉన్నది.

5). కే జి ఎఫ్-2:
యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా 165 కోట్లతో 5వ స్థానంలో చోటు సంపాదించుకుంది..

అయితే వీటితో పాటుగా బాలీవుడ్ చిత్రాలు పఠాన్, జవాన్ వంటి చిత్రాలు బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ మొత్తంలోనే రాబట్టాయి.. కలెక్షన్స్ విషయంలో మాత్రం తెలుగు సినిమాలు గట్టి పోటీ ఇస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: