ఎస్ పుష్ప 2 రిలీజ్ సాక్షిగా విజ‌య్ ఫ్యామిలీతో మ‌రింత బ‌ల‌ప‌డిన ర‌ష్మిక బంధం..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ .. హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ఏదో ఉందన్న ప్రచారం గత కొంతకాలంగా నడుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో గీతగోవిందం - డియర్ కామ్రేడ్ రెండు సినిమాలు వచ్చాయి.  ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చిన‌ గీతగోవిందం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అటు విజయ్ కు తిరుగులేని క్రేజ్‌ తెచ్చి పెట్టింది. అక్కడ నుంచి విజయ్ రష్మిక మధ్య ఉన్నది ప్రేమా ? స్నేహమా లేదా అంతకుమించి జీవితాంతం బంధాన్ని కంటిన్యూ చేయాలను కుంటున్నారా ఇలా రకరకాల ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. మీడియాలో నూ .. సోషల్ మీడియాలో నూ విజయ్ దేవరకొండ - రష్మిక జంట అంటే ఒక సంచలనం. వీరిద్దరూ ప్రస్తుతం వేరువేరు సినిమాలు చేస్తున్న కూడా వీలున్నప్పుడల్లా కలిసి కనిపిస్తున్నారు. హైదరాబాదులోనూ బయట ప్రాంతాల్లో కూడా చాలాసార్లు కలిసి కెమెరాలుకు చిక్కారు. . తాజాగా రష్మిక నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప 2 రిలీజ్ వేళ విజయ్ దేవరకొండ తో తన బంధాన్ని రష్మిక మరింత స్ట్రాంగ్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి రష్మిక పుష్ప 2 సినిమాను వీక్షించారు. హైదరాబాదులోని మహేష్ బాబు ఏఎంబి మాల్లో విజయ్ దేవరకొండ తల్లి మాధవి ... అతని సోదరుడు ఆనంద్ దేవరకొండ తో కలిసి రష్మిక సినిమాకి వెళుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరితో పాటు విజయ్ కనిపించలేదు. ఇప్పటికే ర‌ష్మిక ను విజ‌య్ కుటుంబం త‌మ కోడ‌లిగా అంగీక‌రించింది అంటోన్న టాక్ ఉంది. దానికి ఇది మ‌రింత బ‌లం చేకూర్చేలా ఉంది. ఇక విజ‌య్ ప్ర‌స్తుతం త‌న కెరీర్ లో 12వ సినిమా లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: