నైజాం కింగ్‌గా పుష్పగాడి తాండవం.. RRR రికార్డు గల్లంతు..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప 2. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డులకు ఎసరు పెట్టాడు ఇప్పటికే. పలు కొత్త రికార్డులు ఈ సినిమా తన పేరుతో నమోదు చేసుకుంటుంది. తాజాగా నైజాం ఏరియాలో సినిమా నెవర్ బిఫోర్ రికార్డును క్రియేట్ చేయబోతున్నట్టు సిని వర్గాలు అంచనా వేస్తున్నాయి. రోజు టికెట్ బుకింగ్స్ విధ్వంసం చూసినవారు ఈ అంచనాలు వేస్తున్నారు. పుష్ప 2 తొలి రోజు నైజాం వరకు ఏకంగా రు . 30 కోట్ల షేర్ వసూలు చేస్తుందని వారు చెప్తున్నారు. బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల రిపోర్ట్ చూస్తే ఇది స్పష్టం అవుతుంది. దీంతో నైజాంలో ఇప్పటి వరకు త్రిబుల్ ఆర్ సినిమా పేరుతో ఉన్న హైయెస్ట్ డే 1 ఓపెనింగ్ రికార్డుకు పుష్ప గాడు పెట్టాడని చెప్పాలి.
ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో చూసినా కూడా నైజాంలో వీరంగం ఆడేయడం ఖాయం గా కనిపిస్తోంది. ఏదేమైనా బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ హంగామా ఓ రేంజ్ లో కొన్ని రోజుల పాటు కొనసాగనుంది. పుష్ప -2 మొత్తం వరల్డ్‌వైడ్‌లో కూడా స్టన్నింగ్ లెక్కలు నమోదు చేస్తుందని . . ఈ దూకుడు మరింత ముందుకు వెళ్లడం ఖాయమని పలువురు విశ్లేషకులు కూడా కామెంట్ చేస్తున్నారు. మరి పుష్ప - 2 ఎలాంటి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే కొద్ది రోజుల పాటు వేచి చూడాలి. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రు . 1000 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది . ఇందులో థియేట్రికల్ బిజినెస్ రు . 600 కోట్ల కు పైగా జరిగింది.