ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల అయింది. అల్లు అర్జున్ కెరియర్లో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన మొట్ట మొదటి సినిమా పుష్ప పార్ట్ 1 మూవీనే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా తెలుగు కంటే కూడా హిందీ లో భారీ స్థాయి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే ఈ మూవీ బృందం వారు పుష్ప పార్ట్ 1 మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాను రూపొందించారు. మొదటి నుండి కూడా ఈ మూవీ బృందం వారు నార్త్ పై పెద్ద స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాడు. ఇక నిన్న అనగా డిసెంబర్ 5 వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ మూవీ బృందం వారు నార్త్ ఇండియా పై ఫుల్ ఫోకస్ పెట్టారు.
అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నార్త్ ఇండియా నుండి అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో నార్త్ ఇండియాలో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి నుండి టార్గెట్ గా నార్త్ ఇండియాను ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ బృందానికి అక్కడి నుండి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది.