సమంతకు 25 లక్షలు ఇచ్చా.. స్టార్ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో సమంత ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా రూపొందిన ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో చాలా మూవీలు మంచి విజయాలను సాధించడంతో తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది.

ఇకపోతే ఈమెకు 25 లక్షల రూపాయలను ఇచ్చినట్లు తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చాడు. ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు .? ఎందుకు సమంత కు 25 లక్షల రూపాయలు ఇచ్చాడు అనే వివరాలను తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బెల్లంకొండ సురేష్ ఒకరు. ఈయన తన కుమారుడు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను అల్లుడు శీను అనే సినిమాతో వెండి తెరకు పరిచయం చేశాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్గా నటించింది. 2014 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా సమయం లో సమంత ఏదో చర్మ సమస్యతో బాధపడుతూ ఉండడంతో 25 లక్షల రూపాయలను సమంత కు ఇచ్చినట్లు బెల్లంకొండ సురేష్ తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు.

ఇక సమంత కూడా తాను చేసిన పనిని మర్చిపోలేదు అని , ఇప్పటికీ కూడా కృతజ్ఞత భావాన్ని చూపిస్తుంది అని బెల్లంకొండ సురేష్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే అల్లుడు శీను మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించగా ...  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. తమన్నా ఈ మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. బ్రహ్మానందం , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: