టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఆ తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా తమ జర్నీ నీ కొనసాగిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయి కలిగిన దర్శకుల స్థాయికి చేరుకుంటున్నారు. ఇకపోతే పైన ఓ ఫోటో ఉంది కదా ఆ ఫోటోలో ఒక బక్క పల్చని వ్యక్తి ఉన్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
ఈయన దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా అనేక విజయవంతమైన సినిమాలుకు దర్శకత్వం వహించి ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అతను ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన మరెవరో కాదు గ్రేట్ డైరెక్టర్ సుకుమార్. సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుతుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో ఎన్నో మూవీ లు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. కొంత కాలం క్రితం ఈయన పుష్ప పార్ట్ 1 అనే సినిమాను రూపొందించాడు.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ కి కొనసాగింపుగా ఈయన పుష్ప పార్ట్ 2 మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ నిన్న అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి.