యానిమల్ బ్యూటీ మరో ఘనత.. నెటిజన్స్ ఫిదా..!

Divya
యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది త్రిప్తి డిమ్రి. ఐ ఎం డి బి 2024 జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 2024 టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల జాబితాలో నంబర్ వన్ ర్యాంకింగ్ పొందడం తృప్తి కెరియర్ కు అదనపు బూస్ట్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఉత్తరాఖండ్ లో జన్మించిన ఈమె 'పోస్టర్ బాయ్స్' అనే సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అయితే 'లైలా మజ్ను' సినిమాలో తన పాత్రతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు దక్కించుకున్న ఈమె ఆకర్షణీయమైన రూపం తన ఎదుగుదలకు సహకరిస్తున్నాయి. డిసెంబర్ 5న ఐఎండిబి తన వార్షిక జాబితాను 250 మిలియన్లకు పైగా ప్రపంచ సందర్శకుల పేజీ వీక్షనుల ఆధారంగా వెల్లడించగా.. ఈ ఎంపికకు తన కృతజ్ఞతా భావాన్ని తెలియజేసింది. ముఖ్యంగా ఈ జాబితాలో నెంబర్ వన్ ర్యాంకు పొందడం చాలా గొప్ప గౌరవం అని, ఈ గుర్తింపు నా అభిమానుల వల్లే సాధ్యమైందని ఆమె తెలిపింది. వారి అపురూపమైన మద్దతుకు సహకారానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ తెలిపింది ముద్దుగుమ్మ.

దాదాపు 8 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగిన ఈమె యానిమల్ సినిమాతో ఒక్క రాత్రిలోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సంవత్సరం మాతృత్వాన్ని స్వాగతించిన దీపికా పదుకొనే.. ఫైటర్, కల్కి 2898 ఏడి వంటి భారీ చిత్రాలతో అభిమానుల ముందుకు వచ్చింది. ఇక ఈ జాబితాలో దీపిక రెండవ స్థానంలో నిలువగా, ఇషాన్ కట్టర్ మూడో స్థానంలో నిలిచారు. ఈయన నికోల్ కిడ్మాన్ తో కలసి ది పర్ఫెక్ట్ కపుల్ లో చేసిన పాత్ర కారణంగా తన అభిమానుల సంఖ్యను పెంచుకున్నారు.  అలా మూడవ స్థానంలో నిలిచారు. మొత్తానికైతే త్రిప్తి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని తన కెరీర్ కు మంచి బూస్ట్ ను తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: