పెళ్లిలో అక్కినేని కొత్త కోడలు కట్టుకున్న చీర ధర తెలిస్తే మైండ్ బ్లాక్..?

Pandrala Sravanthi
అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు నాగచైతన్య శోభితా ధూళిపాళ్లలు ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరు పెళ్లికి సంబంధించి ఒక మంచి పెళ్లి సెట్ ని వేశారు. ఇక ఆ సెట్లోనే నాగచైతన్య శోభిత ధూళిపాళ్లలు పెళ్లి బంధం ద్వారా ఒక్కటయ్యారు.ఇక నాగార్జున వీరిద్దరి పెళ్లి జరిగాక ఎమోషనల్ పోస్ట్ చేశారు.మా ఇంట్లో కొత్తదనం తీసుకువచ్చింది.మా మొహాల్లో కొత్త నవ్వు తీసుకువచ్చింది. ఇది పెళ్లి మాత్రమే కాదు ఒక ఎమోషనల్ బాండింగ్ అంటూ ఇలా ఎంతో అద్భుతంగా నాగార్జున తన కొడుకు నాగచైతన్య శోభితల పెళ్లి గురించి ట్వీట్ చేశారు. అయితే సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటే వాళ్ళు కట్టుకున్న చీరలు, వేసుకున్న డ్రెస్సులు,ధరించిన నగల గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. 

ఇక సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్న నాగచైతన్య శోభిత ధూళిపాళ్లల పెళ్లి బట్టలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.అయితే శోభిత ధూళిపాళ్ల పెళ్లికి రెండు చీరలు కట్టుకుంది.ఇక పెళ్లిరోజు కట్టుకున్న చీరనీ డిజైన్ చేసింది నీత లుల్లా .. ఈమె ఎంతోమంది సెలెబ్రిటీలకు డిజైనర్ గా చేస్తుంది. అయితే అలాంటి నీతా లుల్లా దగ్గర శోభితా ధూళిపాళ్ల తన పెళ్లి చీరని స్పెషల్ గా డిజైన్ చేయించుకుందట. ఇక పెళ్లి చీర కోసం దాదాపు 3 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.అలాగే మరో చీర కోసం కేవలం 10000 మాత్రమే ఖర్చు పెట్టి సింపుల్గా డిజైన్ చేయించుకుందట.

అంతే కాకుండా శోభిత ధూళిపాళ్ల పెళ్లిలో ఏడు వారాల నగలు కూడా ధరించింది. ఇక శోభిత బ్రాహ్మణ అమ్మాయి కాబట్టి బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించి ఆచార సాంప్రదాయాలు అన్నింటిని ఈ పెళ్లిలో చూపించారు.అలా పసుపు దంచడం నుండి మొదలు మంగళ స్నానాలు, పెళ్లికూతురుని చేయడం ఎలా ఎన్నోవేడుకలను నిర్వహించారు. చివరిగా అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం సాక్షిగా నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: