స్నేహ విడాకులు నిజమేనా.. అది పర్సనల్ విషయం అంటూ.?

Pandrala Sravanthi
సీనియర్ నటి స్నేహ అంటే తెలియని వారు ఉండరు. అందానికే అసూయ పుట్టేలా ఉండే ఈ ముద్దుగుమ్మ 40 ఏళ్ల వయసు దాటినా కూడా ఇంకా పాతికేళ్ల అమ్మాయిలాగే తన అందంతో ఎంతోమంది కుర్రకారుని కట్టి పడేస్తుంది. ముఖ్యంగా ఎంతో సాంప్రదాయ బద్ధంగా ఉండే చీరలు కట్టుకుంటూ ఒంటినిండా నగలు వేసుకొని అచ్చం తెలుగింటి ఆడపిల్లలాగే కనిపిస్తుంది. ఎంతో మంది హీరోయిన్లు అవకాశాలు తగ్గాక సినిమాలో మళ్లీ అవకాశాలు అందుకోవడం కోసం పొట్టి పొట్టి బట్టలు వేస్తూ హాట్ హాట్ గా రెచ్చిపోతున్న సమయంలో కూడా స్నేహమాత్రం అలాంటి హద్దులు మీరకుండా పొట్టి బట్టలు వేసుకోకుండా ఒంటి నిండా చీర కట్టుకొని చాలా సాంప్రదాయంగా కనిపిస్తుంది. ఇంకా ఈ హీరోయిన్ ని చూస్తేనే తెలుగుదనం ఉట్టి పడేలా ఉంటుంది. 

అలాంటి ఈ ముద్దుగుమ్మ వినయ విధేయ రామ,సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక గత కొద్ది రోజుల నుండి ఈ ముద్దుగుమ్మ తన భర్త ప్రసన్నతో విడాకులు తీసుకోబోతుంది అని వార్తల్లో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే చాలాసార్లు స్నేహ విడాకుల వార్తలు వచ్చిన ప్రతిసారి ఈ విషయంపై స్నేహ అలాగే ప్రసన్న ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా సెలబ్రిటిల విడాకుల విషయం గురించి మాట్లాడుతూ.. విడాకులు తీసుకోవడం అంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో అది వారి పర్సనల్. అసలు వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో తెలియకుండా మాట్లాడడం మంచిది కాదు.

అది వారి పర్సనల్ విషయం.. వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలియనప్పుడు దాని గురించి మాట్లాడే అధికారం లేదు అంటూ స్నేహ చెప్పింది.  ఇక రీసెంట్ గా స్నేహ సారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సమయంలో తన భర్త ప్రసన్నాతో కలిసి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని ఈ విషయం గురించి మాట్లాడింది.అయితే చాలా రోజుల నుండి వీరి మధ్య విభేదాలు వస్తున్నాయి అనే రూమర్లకు ప్రసన్నాతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడంతో ఆ రూమర్స్ కి చెక్ పెట్టినట్లు అయింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: