నిన్న అనగా డిసెంబర్ 5 వ తేదీన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు అనగా డిసెంబర్ 4 వ తేదీనే పలు ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా గురించి ఇప్పటికే అనేక మంది సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వారు స్పందించారు.
ఇకపోతే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటులుగా తమకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ కిషన్ , శ్రీ విష్ణు కూడా పుష్ప 2 మూవీ పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు హీరోలు పుష్ప 2 సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. సందీప్ కిషన్ "పుష్ప 2" మూవీ గురించి స్పందిస్తూ ... నాకు ఇష్టమైన అల్లు అర్జున్ , సుకుమార్ , రష్మిక , శ్రీ లీల , దేవి శ్రీ ప్రసాద్ ప్రదర్శన ఈ సినిమాలో అమోఘం. ఎక్కడ చూసినా ఇదే వైబ్ కొనసాగుతోంది అని పేర్కొన్నాడు. ఇక శ్రీ విష్ణు "పుష్ప 2" మూవీ లో బన్నీ రఫ్ఫా రఫ్ఫా పర్ఫామెన్స్ , సుకుమార్ విజినరీ డైరెక్షన్ , రష్మిక , ఫహద్ నటన అద్భుతం. మూవీ టీం కి కంగ్రాట్స్ అని పేర్కొన్నాడు.
ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ కి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది అని అల్లు అర్జున్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ మూవీ 1000 కోట్లకు మించి కలెక్షన్లను రాబడితేనే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.