అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో మిస్ అయిన మూవీ ?
మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 175 కోట్లు వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. రష్మిక మందన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో రష్మిక కన్నా మంచిగా ఎవరు చేయలేరు అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో శ్రీ లీల డ్యాన్స్ కి అభిమానులు అంతా ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే.... కెరీర్ ఆరంభంలో అల్లు అర్జున్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఆర్య అని చెప్పవచ్చు.
ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఇదే సినిమాతో సుకుమార్ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. వన్ సైడ్ లవ్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్య సినిమాతో అల్లు అర్జున్ కు స్టార్ డమ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ పోతినేనితో కలిసి జగడం సినిమా తీశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే ఈ సినిమాను మొదట సుకుమార్ అల్లు అర్జున్ తో కలిసి తీయాలని అనుకున్నారట. కానీ దిల్ రాజుతో జరిగిన ఒక చిన్న గొడవ వల్ల ఈ సినిమాను అల్లు అర్జున్ తో కాకుండా రామ్ పోతినేనితో కలిసి చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని సుకుమార్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ సినిమా కనుక అల్లు అర్జున్ చేసి ఉంటే కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ సాధించేదేమోనంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.