నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అతిథి రావు హైదరి ఒకరు . ఈ ముద్దు గుమ్మ తెలుగు లో పలు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె తెలుగు లో మొదటగా సుధీర్ బాబు హీరోగా రూపొందిన సమ్మోహనం అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో అదితి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత ఈమె శర్వానంద్ , సిద్ధార్థ్ హీరోలుగా రూపొందిన మహా సముద్రం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సమయం లోనే సిద్ధార్థ్ , అదితి రావు హైదరి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంత కాలానికే వీరు వివాహం కూడా చేసుకున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం అదితి రావు హైదరి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన హిరామండి అనే వెబ్ సిరీస్ లో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి రావు హైదరీ మాట్లాడుతూ ... హిరామండి వెబ్ సిరీస్ లో నేను కొన్ని సన్నివేశాలలో రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది.
వాటి కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. సంజయ్ లీలా బంసాలి నన్ను రోజంతా ఆకలితో ఉంచేవారు. ఆకలి , కోపంతో ఆ సీన్లు నేను బాగా చేయగలిగాను అని ఈమె పేర్కొంది. ఇకపోతే హిరామండి వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ వెబ్ సిరీస్ లోని ఆదితి రావు హైదరి నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.