పార్టీ ఉందా బన్నీ..? ఆ టైం వచ్చేసింది..!
పుష్ప2 రిలీజ్ అయింది .. రిలీజ్ కి ముందు మెగా కాంపౌండ్ నుంచి సాయి ధరమ్‌తేజ్ పోస్ట్ పెట్టాడు యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా సినిమా పేరు బన్నీ పేరు ప్రస్తావించినప్పటికీ పరోక్షంగా వాళ్లకు శుభాకాంక్షలు చెప్పారు.ఇక గతంలో ఈ వివాదం ఎంతో హాట్ టాపిక్ గా మారినప్పుడు ఈ ఇద్దరే హైలెట్ అయిన విషయం తెలిసిందే. ముందుగా స్థాయి ధరమ్ తేజ్ బన్ని సోషల్ మీడియాలో అన్ ఫాలో కొట్టగా ఆ తర్వాత నాగబాబు బహిరంగంగానే తన వ్యతిరేకతను వ్యక్తం చేశాడు. మనవడు పరాయోడు అంటూ పెద్దపెద్ద పోస్ట్ పెట్టి తర్వాత డిలీట్ చేశాడు. ఇక ఇద్దరు ఇప్పుడు బన్నీకి అనుకూలంగా పోస్టులు పెట్టారు కాబట్టి ఇప్పుడు బన్నీ చొరవ తీసుకునే సమయం వచ్చింది.
ఈ దిశగా అయిన ఇప్పటికే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. బాలయ్య షోలో పవన్ ను పొగిడాడు తన సినిమాకు టికెట్ రేట్లు పెంచినప్పుడు పవన్ కు థాంక్స్ చెప్పాడు. ఇదే క్రమంలో సక్సెస్ పార్టీ పెట్టి పెద్ద పార్టీ ఇచ్యి అందర్నీ పిలిస్తే అంతా బాగుంటుంది .. ఇలా పార్టీ ఇవ్వటం బన్నీకి కొత్త కాదు కాబట్టి ఇదే సరైన సమయం అంటున్నారు . ఇక మరి.. ఇప్పటికే పుష్ప 2 భారీ కలెక్షన్ దిసగా తీసుకుపోతుంది.. తొలిరోజే హిందీలో 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన తొలి సౌత్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో తొలిరోజు కలెక్షన్ కూడా ఎవరు ఊహించని రేంజ్ లో ఉన్నాయి ఇలాంటి సమయంలో బన్నీ పార్టీ ఇస్తే అందరికీ గట్టి సమాధానం ఇచ్చినట్టు ఉంటుంది .. ఇక మరి పార్టీ ఉందా లేదా పుష్ప రాజ్‌కే తెలియాలి .