నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎప్పటి నుండో బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై అనేక వార్తలు వచ్చాయి. మోక్షజ్ఞ మొదటి సినిమా ఆ దర్శకుడితో ఉండబోతోంది ... ఈ దర్శకుడితో ఉండబోతుంది అని అనేక వార్తలు తెర పైకి వచ్చాయి. కానీ బాలకృష్ణ కానీ మోక్షజ్ఞ కానీ అందుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొంత కాలం క్రితం నుండి మోక్షజ్ఞ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వరుస పెట్టి వస్తున్నాయి.
అందులో భాగంగా మోక్షజ్ఞ తన ఫస్ట్ మూవీ ని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక మోక్షజ్ఞ ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత మరో మూవీ చేస్తాడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ మోక్షజ్ఞ మాత్రం అదిరిపోయే రేంజ్ స్పీడ్ లో దూసుకుపోయేలా కనిపిస్తున్నాడు. ఎందుకు అంటే మోక్షజ్ఞ మొదటి సినిమా స్టార్ట్ కాకముందే ఈయన మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేసాడు. మోక్షజ్ఞ తన రెండవ సినిమాని కొంత కాలం క్రితం లక్కీ భాస్కర్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలబడబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం ఆదిత్య 369 అనే సినిమాలో హీరోగా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇక తాజాగా బాలకృష్ణ , మోక్షజ్ఞ హీరోగా ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్తో మూవీ రూపొందబోతున్నట్లు దానికి సంబంధించిన మరిన్ని వివరాలను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. దీనితో మోక్షజ్ఞ అదిరిపోయే రేంజ్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కానీ ఈ సినిమాల విడుదల తేదీలపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.