పుష్ప 2 : ఆ సీన్స్ లేపేసిన సుక్కు మావ.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప2. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.అంతేకాదు తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో పుష్ప2 మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఇదిలావుంటే పుష్ప 1 సినిమాకు వచ్చిన ఆదరణ వల్లే 'పుష్ప 2'కి హైప్‌ వచ్చిందని అనుకుంటారు కానీ.. సినిమా తొలి టీజర్‌కి వచ్చిన హైపే ప్రధానమైన కారణం అని చెప్పాలి.ఈ క్రమంలో పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్ప వచ్చినట్లు' అనే డైలాగ్‌లో ముగిసిన టీజర్‌ మీకు గుర్తుండే ఉంటుంది.2023 ఏప్రిల్ 8వ తేదీ. బన్నీ బర్త్ డే. ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 7 తేదీనే ఫ్యాన్స్ కు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. అదే వేర్ ఈజ్ పుష్ప3 నిమిషాల 18 సెకన్లు ఉన్న ఆ వీడియో పుష్ప 2 మూవీపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసేలా చేసింది… ఆ వీడియోలో…పుష్పరాజ్‌పై పోలీసులు పది రౌండ్స్ కాల్పులు జరపడంతో, తీవ్ర గాయాల పాలు అవ్వడంతో, పుష్ప అడవుల్లోకి పారిపోయాడు అంటూ న్యూస్ వస్తుంటుంది. ఆ న్యూస్ ను ప్రజలు అసలేం జరుగుతుంది అంటూ చూస్తారు. బాక్రాపేట అడవుల్లో రక్తంతో ఉన్న పుష్ప రాజ్ చొక్కా కనిపించిందని, దానికి 8 బుల్లెట్ల రంధ్రాలున్నాయని ఆ వార్తలో చెబుతారు. 8 బుల్లెట్స్ తగిలిన తర్వాత పుష్ప రాజ్ బతికే ఛాన్స్ లేదు అని అందరూ అనుకుంటారు.
ఆ టైంలోనే ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి న్యూస్ ఛానెల్‌కి వీడియో క్యాసెట్ ఇస్తాడు. ఆ వీడియోలో… అడవిలో ఓ పులి కనిపిస్తుంది. ఆ పులి ఓ వ్యక్తిని చూసి భయపడి వెనక్కి రెండు అడుగులు వేస్తుంది. అక్కడ ఉన్న వ్యక్తి ఎవరా అని చూస్తారు. " జంతువులు రెండు అడుగులు వెనక్కి వేసినాయంటే పులిచ్చొండాదని అర్థం. మరి పులి రెండు అడుగులు వెనక్కి వేసినాదంటే పుష్ప వచ్చుండాడని అర్థం" అనే డైలాగ్ రావడంతో అల్లు అర్జున్ ఫేస్ రివీల్ అవుతుంది. ఈ డైలాగ్, అల్లు అర్జున్, పులి వెనక్కి అడుగు వేయడం అన్ని కూడా గూస్ బమ్స్ వచ్చేలా ఉంటాయి.ఈ వీడియో వచ్చి ఏడాది అవుతుంది కదా… అందుకే ఒక సారి గుర్తు చేశాం. ఈ సీన్ చూడాలని అల్లు అర్జున్‌తో పాటు పుష్ప మూవీ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. కానీ, అది సినిమాలో లేదు. అసలు పుష్ప రాజ్ పైన కాల్పులు జరిపే సీనే లేదు. అడవి పులి అనే కాదు. అసలు సినిమాలో ఈ పార్ట్ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశలో పడిపోయారు. అంత ఎలివేషన్ ఉండే సీన్ ఎందుకు పెట్టలేదు అంటూ సుక్కుపై ఫైర్ అవుతున్నారు. ఆ సీన్ కూడా ఉంటే సినిమాపై ఇప్పుడు వస్తున్న నెగిటివిటీ కొంత మేరకు అయినా కవర్ అయ్యేది అని చెబుతున్నారు.ఇదిలావుండగా పుష్ప 2' సినిమా క్లైమాక్స్‌లో బాంబు పేలిన తర్వాత 'పుష్ప' పోలీసులకు దొరికిపోతాడని.. అక్కడి నుండి భార్యతో కలసి తప్పించుకుని అడవుల్లోకి వెళ్లిపోయి తన ర్యాంపేజ్‌ చూపిస్తాడని చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ మంచి హై ఇచ్చే సీన్‌ అయితే మిస్‌ అయ్యాం. నిజానికి ఆ సీనే కాదు జపాన్‌లో డీల్‌ చేసే సీన్‌ కూడా మిస్‌ అయ్యాం. అదేమైందో తెలియాలి. ఇక జాలి రెడ్డి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సీన్‌ కూడా అదే పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: