రీసెంట్ గా కొంతమంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తుంది.ఇక ఈ విడాకులను చూసి చాలామంది మాములు జనాలు అయితే పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవడం విడాకులు ఎందుకు తీసుకోవడం.. ఇంకా పెళ్లికి ముందే డేటింగ్ కూడా చేస్తారు.ఆ సమయంలో తెలియదా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటాయో..ఇలా పెళ్లయి 20, 30 సంవత్సరాల అయ్యాక కూడా సంసార జీవితంలో అర్థం చేసుకోకపోవడానికి ఏముంటుంది.. అసలు ఎందుకు ఈ విడాకులు అంటూ తిట్టిపోస్తున్నారు. ఓవైపు వీరిపై నెగటివ్ టాక్ వస్తున్నా కూడా మరోవైపు తమ పర్సనల్ లైఫ్ తమకు ముఖ్యం అని సెలబ్రిటీలు పిల్లలని కూడా ఇబ్బందులు పెడుతూ విడివిడిగా బతుకుతున్న సెలబ్రిటీలను మనం ఎంతో మందిని చూసాం. అయితే తాజాగా జయం రవి ఆర్తి,ఏఆర్ రెహమాన్ సైరా భానూ లు విడాకులు తీసుకోబోతున్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా మరో బ్యూటీ కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే.. మేం వయసుకు వచ్చాం నటి నీతి టేలర్.. తనీష్ హీరోగా నీతి టేలర్ హీరోయిన్ గా..సెకండ్ హీరోయిన్ గా రీమాసేన్ నటించిన మేం వయసుకు వచ్చాం సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా అప్పటి కుర్ర కారుని ఎంతగానో అలరించింది.ముఖ్యంగా ఈ సినిమాలోని "వెళ్లిపోకే వెళ్లిపోకే నన్నే ఒంటరి చేసి" అనే పాట అప్పట్లో బ్రేకప్ చెప్పిన లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్లని కన్నీళ్లు పెట్టించింది. అయితే అలాంటి ఈ సినిమా ద్వారా ఫేమస్ అయిన నీతి టేలర్ ఆ తర్వాత లవ్ డాట్ కం,పెళ్లి పుస్తకం వంటి సినిమాల్లో అలరించింది.
ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు,సీరియల్స్ చేసింది.అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నీతి టేలర్ పెళ్లి చేసుకుంది.2020లో ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి పరీక్షిత్ భవా ని పెళ్లి చేసుకుంది.అయితే ఇన్ని సంవత్సరాలుగా వీరి వైవహిక జీవితం బాగున్నప్పటికీ తాజాగా వీరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకోబోతున్నట్టు బీటౌన్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ రూమర్లు నిజమే అనేలా తాజాగా నీతి టేలర్ తన సోషల్ మీడియా ఖాతా నుండి భవా అనే పేరును తొలగించి నీతి టేలర్ గా మార్చుకుంది.దాంతో ఈ విడాకుల రూమర్లు మరింత ఎక్కువయ్యాయి.మరి నిజంగానే నీతి టేలర్ విడాకులు తీసుకోబోతుందా.. లేక పొరపాటున అలా పేరు మార్చేసిందా అనేది తెలియాల్సి ఉంది