నేషనల్ అవార్డు రావాలంటూ అభిమాని కామెంట్.. రష్మిక ఏమందో తెలుసా?

praveen
అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న ఇద్దరూ తమ నటనతో చించేసారని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా, ‘శ్రీవల్లి’ పాత్రలో నటించిన రష్మిక, తన పాత్రకు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆశ్చర్యపోతున్నారు. ఎక్స్‌ ప్లాట్‌ఫామ్ పై హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. చాలామందికి ఆమె రిప్లైలు ఇచ్చారు. ‘పుష్ప 2’ సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు ఆమె ఎంతో సంతోషించారు.
ప్రేక్షకులు తన పాత్రతో చాలా కనెక్ట్ అయ్యారని తెలుసుకున్నా ఈ ముద్దుగుమ్మ ఎంతో సంతోషించింది. ఇంతలా ప్రజల మనసులను తాకిన సినిమాలో భాగమవడం ఆమెకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఈ సీక్వెల్‌లో మరింత బాగా నటించడానికి రష్మిక ఎంతో కష్టపడింది. ఆమె కష్టం ఫలిస్తున్నందుకు ఆమె ఎంతో హ్యాపీగా ఫీలవుతోంది.
ఈ క్రమంలోనే ఒక ఎక్స్‌ యూజర్ "రష్మిక కోసం నేషనల్ ఫిలిం అవార్డు 2024 లోడ్ అవుతోంది. ఆమె జాతర సన్నివేశానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే ఆ ఒక్క సీన్ చేసినందుకుగాను జాతీయ అవార్డు పొందడానికి ఆమె అర్హురాలు అయిపోయింది" అని కామెంట్ చేశాడు. రష్మిక మందన్న దీనికి రిప్లై ఇస్తూ  "😭❤️❤️❤️ నిజంగానా? యాయ్‌! థాంక్యూ!" అని చెప్పింది. ఇప్పుడు ఆమె రియాక్షన్ వైరల్ గా మారింది.
రష్మిక మందన్న ‘శ్రీవల్లి’ పాత్రలో అల్లు అర్జున్‌తో కలిసి అందించిన కెమిస్ట్రీ సినిమా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, ‘జాతర’ సీక్వెన్స్‌లో రష్మిక నటన అందరిని ఆకట్టుకుంది. ‘పుష్ప 2’లో రష్మిక నటన ఇప్పటివరకు ఆమె చేసిన నటనలో ఉత్తమమైనదని అభిమానులు అంటున్నారు. ఒక్క యూజర్ మాత్రమే కాదు చాలామంది ఆమెకు జాతీయ అవార్డు రావాలని కోరుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభిస్తోంది. ‘పుష్ప 2’ మొదటి రోజుకే భారీ కలెక్షన్స్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: