అజిత్- అల్లు అర్జున్ దెబ్బ.. మొత్తానికి షోలే రద్దు..!
అయితే స్టార్ హీరోల చిత్రాలకు బెనిఫిట్ షో లు వేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీ వస్తూ ఉన్నది. ఇప్పుడు పుష్ప-2 సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి మహిళా మృతి చెందడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వం. మృతి చెందిన మహిళ కుటుంబీకులకు మంత్రి సానుభూతి తెలియజేశారు. అలాగే సినీ నిర్మాత, హీరో కలిసి బాధితులని ఆదుకోవాలని బెనిఫిట్ షోలు రద్దు దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదని ఇకపై పెద్ద సినిమాలకు మిడ్ నైట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు అనేవి ఉండకపోవచ్చు అని వెల్లడించారు.. అయితే సరిగ్గా కొన్నేళ్ల క్రితమే తమిళనాడులో కూడా ఇలాగే జరిగిందట.. అజిత్ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కడ ఒక అభిమాని మరణించారు.
అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం అక్కడ బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు రద్దు చేయడం జరిగిందట ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కారణంగా తెలంగాణలో కూడా ఇలాంటి బెన్ఫిట్ షోలు రద్దు కాబోతున్నాయి మరి ప్రస్తుతం సంక్రాంతికి రాబోయే సినిమాల పరిస్థితి ఏంటో అంటూ పలువురు నిర్మాతలు తెగ ఆలోచిస్తున్నారట.. కచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదని ఇలాంటి షోల వల్ల ప్రజలు అభిమానులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు కూడా తెలుపుతున్నారు.. ముఖ్యంగా నటీనటులు ఎవరైనా థియేటర్స్ వద్దకు వస్తే అక్కడ ఉండే అభిమానులకు కచ్చితంగా అందుకు సంబంధించి భద్రత కూడా కల్పించాలని తెలిపారు.