షాక్:డెరైక్టర్ పూరీ జగన్నాథ్ గుట్టు రట్టయిందా..?
అలా ఇటీవలే డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాని చూసి భారీ మొత్తానికి కొన్న నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి చాలా ఇబ్బందులు పడుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా పూరి జగన్నాథ్ చార్మి పైన చాలానే విమర్శలు వినిపించాయి ముఖ్యంగా సినిమాలు ప్లాప్ అయితే ఏ విధంగా కూడా డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వడం లేదని వరంగల్ శ్రీను వంటి బయ్యర్లు కూడా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చాలామంది బయ్యర్లు కోట్లకు కోట్లు నష్టపోయారట.
కానీ నెమ్మదిగా పూరి, ఛార్మి అసలైన రూపాన్ని చూసి షాక్ అవుతున్నారు..చైతన్య రెడ్డి- నిరంజన్ రెడ్డి.. డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కి ఇవ్వలేము కానీ సినిమాలను చేస్తామని చెబుతున్నారట. ఇందు కొరకు నెల నెల కొంతవరకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని అడుగుతూ ఉన్నారట. అంతే కాకుండా మళ్లీ లాభాలలో సగం వాటా ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారట.. దీంతో వారు ఏ విధంగా సహాయం చేస్తున్నారో వారికి అర్థం కాక వీరు తలలు పట్టుకుంటున్నారు.. ఎక్కువగా డిమాండ్ చేస్తే డబ్బులు లేవు కావాలంటే తమ పాత చిత్రాలను రీ రిలీజ్ చేసుకొని అందులో వచ్చిన ఆదాయంలో సగభాగం తీసుకోమని చెబుతున్నారట.. ఇలా అన్నిటిలో కూడా లెస్కులు పెట్టడంతో అసలు పూరి, ఛార్మి గురించి విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయట.
ఇటీవల డబుల్ ఇస్మార్ట్ శంకర్ సమయంలో కూడా పేమెంట్స్ కట్టేటప్పుడు టీడీఎస్ కట్ చేయకుండానే డైరెక్ట్గా పే చేశారట.. ఇప్పుడు టీడీఎస్ మొత్తం చెల్లించమంటే అసలు రెస్పాన్స్ లేదని.. ఇంత దారుణంగా మోసపోతామని అనుకోలేదని చైతన్య రెడ్డి- నిరంజన్ రెడ్డి తవ స్నేహితులతో చెప్పుకొని బాధపడ్డారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది... డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసుకునే ముందు చెప్పిన మాటలు ప్రవర్తన సినిమా విడుదలైన తర్వాత ప్రవర్తనకు చాలా తేడా ఉందని ఈ సినిమా వల్ల సర్వం కోల్పోయామని తెలుపుతున్నారట చైతన్య రెడ్డి- నిరంజన్ రెడ్డి.