పుష్ప 2: రికార్డులన్నీ తిరగ రాసిన అల్లు అర్జున్.. టచ్ చేసేదెవరు..?
పుష్ప సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. మొదటి భాగం రిలీజ్ అయినప్పుడే పుష్ప తన యాటిట్యూడ్ తో ఉత్తరాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.అందుకే సౌత్ లో కంటే ఎక్కువగా నార్త్ లో ఈ సినిమాకి ఆడియన్స్ బాగా చేరువయ్యారు.. పుష్ప-2 ప్రమోషన్స్ ని కూడా నార్త్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్.. మొదటి ఈవెంట్ ని పాట్నాలో నిర్వహించగా తన టార్గెట్ ఏంటి అన్నది కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు తను అనుకున్న టార్గెట్ ను కూడా రీచ్ అయినట్టుగా ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.. మాస్ ఆడియన్స్ ని సైతం టార్గెట్ చేస్తూ బాలీవుడ్ లో మొదటి రోజే 72 కోట్లకు కలెక్షన్స్ రాబట్టగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మరొకసారి కొత్త రికార్డులను తిరగరాసింది. రూ.294 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో హిస్టరీ రికార్డును తిరగరాసింది.. ఇప్పటివరకు RRR, బాహుబలి-2,KGF, కల్కి , వంటి చిత్రాల మొదటి రోజు కలెక్షన్స్ని సైతం తుడిపేస్తూ తరికొత్త రికార్డులను సృష్టించారు అల్లు అర్జున్.. మరి ఈ రికార్డును సైతం చెరిపేసే హీరో ఎవరున్నారు అంటూ అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..