విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పుష్ప-2 మూవీ చూసిన రష్మిక మందన్న...పిక్స్ వైరల్..!

lakhmi saranya
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. రీసెంట్ గా పుష్ప-2 సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అయితే విజయ దేవరకొండ రష్మిక కొన్నాళ్లుగా లవ్ ట్రాక్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు గుప్పుమంటున్నాయి. వీరికి సంబంధించిన ఏ ఫోటో కనిపించినా కూడా జనాలు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఇకపోతే రష్మిక మందన నటించిన తాజా చిత్రం పుష్ప-2 డిసెంబర్ 5 వ తేదీల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కాగా ఈ చిత్రానికి నేషనల్ క్రష్ రష్మిక... విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో చూసినట్లు తెలుస్తోంది. హైదరాబాదు లోని సంధ్య థియేటర్ లో విజయ్ తల్లి, తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో కనిపించింది. ప్రెసెంట్ ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 ఈ పిక్స్ తో పుకార్లకు కాస్త బలం చేకూర్చన్నట్లు ఉందని నెటిజన్లో భావిస్తున్నారు. ఇక రష్మిక మందన అండ్ ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 థియేటర్లలో సందడి చేస్తోంది. శ్రీలీల కిస్సిక్ సాంగ్ బాక్స్ ఫీసును షేక్ చేస్తుంది. భారీ వసూళ్లు కొల్లగోడుతూ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు, రావు రమేశ్ కీలక పాత్రలో నటించి... ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మిక మందన రిలేషన్ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: