దేవర సినిమా మిగిల్చిన విషాదం.. గుండెపోటుతో అభిమాని మృతి..!!

Pandrala Sravanthi
 స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే వెన్నులో వణుకు పుడుతుంది.ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి ఎంతోమంది అభిమానులు ఎగబడుతున్నారు. దీంతో లెక్కకు మించిన భారం కావడంతో థియేటర్ యాజమాన్యానికి ఇబ్బంది అవ్వడంతో పాటు అభిమానులు కూడా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చి విడుదలయ్యే సమయంలో అయితే వారిని ఆపడం పోలీసుల వల్ల కావడం లేదు. ఇక ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఎన్నో విషాద సంఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా పుష్ప టు సమయంలో రేవతి మృతి తో పాటు అప్పట్లో దేవర సినిమా సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మస్తాన్ అలీ మృతి పెద్ద విషాదం నింపింది.మరి ఇంతకీ మస్తాన్ చనిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
 దేవర సినిమా చూస్తూ అభిమానికి గుండెపోటు:

 జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ దేవర.. ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొందరేమో సినిమా నచ్చలేదంటే మరికొందరేమో యావరేజ్ గా ఉంది అన్నారు. ఇలా సినిమా చూసిన ప్రేక్షకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రివ్యూ ఇచ్చారు. అయితే దేవర సినిమా సమయంలో పెద్ద విషాదం జరిగింది. అదేంటంటే.. దేవర సినిమాని చూస్తూ ఓ అభిమాని థియేటర్లోనే గుండెపోటుతో మరణించారు.. అప్పటివరకు  సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈలలు వేసిన మస్తాన్ అలీ సడన్ గా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కి తీసుకు వెళ్లే లోపే మరణించాడు.

ఇక విషయంలోకి వెళ్తే.. కడపకు చెందిన సీకే దీన్నే మండలంలోని జమాల్ పల్లికి చెందిన మస్తాన్ అలీ జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద వీరాభిమాని.. ఇక ఈయన దేవర సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డానికి కడపలోని అప్సర థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్నారు.. ఇక సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేసిన మస్తాన్ అలీ ఒక్కసారిగా ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. ఇక ఇది గమనించిన ఆయన స్నేహితులు ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మరణించడంతో డాక్టర్లు మరణించాడు అని చెప్పారు.. అలా అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్న మస్తాన్ అలీ కళ్ళముందే గుండెపోటుతో చనిపోవడంతో ఆయన స్నేహితులు కన్నీళ్లు పెట్టుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: