సలార్‌: కటౌట్‌ కడుతూ కరెంట్‌ షాక్‌.. ప్రభాస్‌ ఫ్యాన్‌ మృతి ?

Veldandi Saikiran
టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రభాస్... ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఒక్కో సినిమా చేసుకుంటూ... ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. రాఘవేంద్ర, ఈశ్వర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రభాస్... ఆ తర్వాత చత్రపతితో తన కెరీర్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. పెద్ద దర్శకులతో సినిమాలు చేశాడు ప్రభాస్.
ముఖ్యంగా జక్కన్న దర్శకత్వంలో బాహుబలి సినిమా చేసి...  పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరోకు లేదు. ఇండస్ట్రీలో ప్రభాస్... ఒక శిఖరం లాంటివాడు. అతని సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు. డై హార్డ్ ఫ్యాన్స్ అయితే..  సినిమా రిలీజ్ కంటే ముందు రోజు నుంచే.. హడావిడి చేస్తూ ఉంటారు.  ఫ్లెక్సీలు అలాగే బ్యానర్లు కట్టడం చేస్తూ ఉంటారు ప్రభాస్ ఫ్యాన్స్.
అయితే.... ప్రభాస్ గత సంవత్సరం రిలీజ్ చేసిన సినిమా సలార్. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా కరెంట్ షాక్ తో ప్రభాస్ అభిమాని మరణించాడు.  శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకోవడం మనం చూశాం. ధర్మవరం పట్టణంలో ఉన్న రంగా థియేటర్ ఎదుట ఓ ఇంటిపై ఫ్లెక్సీ కడుతుండగా.. బాలరాజు అనే ప్రభాస్ ఫ్యాన్ కరెంటు షాక్ తగిలి మరణించాడు.
 ఇంటి పైన ఉన్న ఇనుప వస్తువులు కరెంటు తీగలను తాకడంతో... ఈ ప్రమాదం జరిగింది. దీంతో బాలరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. గజేంద్ర అనే యువకుడు తీవ్రంగా గాయపడడం జరిగింది. ఈ సంఘటనలో మరో నలుగురు యువకులు.. కొద్దిపాటి ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రభాస్... వారికి ఆర్థిక సహాయం కూడా చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: