పుష్ప-2 : పుష్ప రాజ్ గట్టొడే.. మరి స్ట్రాంగ్ విలన్ ఎక్కడా?

praveen
సాధారణంగా ఒక సినిమా పెద్ద విజయం సాధించడానికి మెయిన్ పిల్లర్ లాంటి పాత్ర ఎవరిది ఉంటుందంటే హీరో పాత్ర అనే విషయం తెలిసిందే. డైరెక్టర్ హీరో పాత్రను ఎంత బలంగా డిజైన్ చేసుకున్నాడు అని దాని బట్టి ఆ సినిమా విజయం సాధిస్తుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా అనే అది ఆధారపడి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు హీరో పాత్రను సరిగ్గా చూపించకపోవడంతో సినిమాలో మంచి కథ ఉన్నప్పటికీ ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అయితే సినిమాలో హీరో పాత్ర ఎంత బలంగా చూపిస్తారో విలన్ పాత్ర కూడా అంతే బలంగా ఉండాలి.

 అయితే విలన్లను హీరోల కంటే పవర్ఫుల్ గా చూపించడంలో రాజమౌళి దిట్ట అన్న విషయం తెలిసిందే. హీరోఇజమ్ ఎంత ఎలివేట్ చేస్తాడో విలనిజాన్ని కూడా అంతే బలంగా చూపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇలా హీరోకి తగ్గ విలన్ ఉన్నప్పుడే సినిమా చూసే ప్రేక్షకులకు కూడా అసలు కిక్కు వస్తుంది. కానీ సుకుమార్ మాత్రం ఈ విషయంలో తడబడ్డాడా అంటే అవును అనే చెబుతున్నారు. పుష్ప -2 చూసిన ప్రేక్షకులు పుష్ప అనే సినిమాకు కొనసాగింపుగా వచ్చిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయండి. ఈ సినిమా చూడడానికి వెళ్ళిన ప్రేక్షకులు ఒక్క విషయంలో మాత్రం నిరాశపడుతున్నారు.

 పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఇరగదీసాడు. సుకుమార్ తన టేకింగ్ తో మరోసారి అదరగొట్టేసాడు. కానీ పుష్పా సినిమాలో ఒకటి తక్కువ అయింది. అదే విలన్ పాత్ర పుష్పరాజ్ ను దెబ్బకొట్టేందుకు బలమైన విలన్ లేకపోవడంతో ఈ సినిమా కథ పూర్తిగా పేలవంగా మారిపోయింది. పూర్తిగా పుష్పరాజ్ పాత్ర చుట్టే సినిమా తిరుగుతుంది. కానీ కనీసం పుష్పరాజ్ ను భయపెట్టేందుకు కనీసం ఇబ్బంది పెట్టే విలన్ కూడా ఎక్కడ కనిపించడు. పుష్ప మొదటి పార్ట్ లో ఎంతో బలమైన విలన్ గా కనిపించిన మంగళం శీను, దాక్షాయిని పాత్రలను రెండవ పార్ట్ లో మాత్రం కమెడియన్స్ ని చేసేసాడు సుకుమార్. ఇక పుష్ప రాజ్ కు సరైన మొగుడు శకావత్ అంటూ మొదటి పార్ట్ లో చూపించిన సుకుమార్  అటు రెండవ పార్ట్ లో మాత్రం అతన్ని ఒక సాదాసీదా పోలీస్ ఆఫీసర్ లాగానే పరిమితం చేశాడు. ఇలా పుష్ప 2 మొత్తంలో అటు పుష్పరాజ్ ను ఎదుర్కొనే బలమైన విలన్ పాత్ర ఎక్కడ కనిపించదు. అలాంటి విలన్ పాత్రను ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అని సినిమా చూసిన ప్రేక్షకులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: