సూపర్ స్టార్ రజనీ కాంత్ వల్ల నందమూరి బాలకృష్ణ ఓ సినిమాను వదిలేసాడట. మరి ఆ సినిమా ఏది ..? ఎందుకు వదిలేశాడు ..? దాన్ని రిజల్ట్ ఏమయింది అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ , కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో కథానాయకుడు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగు వర్షన్ లో రజనీ కాంత్ కి స్నేహితుడి పాత్రలో జగపతి బాబు నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో రజనీ కాంత్ కు స్నేహితుడి పాత్రలో మొదటగా జగపతి బాబు ను కాకుండా ఈ మూవీ దర్శకుడు కే ఎస్ రవి కుమార్ , బాలకృష్ణ అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనను కలిసి సినిమా కథను కూడా వివరించగా బాలకృష్ణ ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ విషయం రజినీ కాంత్ కి తెలియడంతో రజనీ కాంత్ ఒక రోజు బాలకృష్ణ కు ఫోన్ చేసి నేను నటించే సినిమాలో నా స్నేహితుడి పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చావంట కదా అని అడిగాడట.
దానితో బాలయ్య అవును అని అన్నాడట. ఇక రజనీ కాంత్ ఆ తర్వాత ఆ పాత్ర నీకు సెట్ కాదు అని అన్నాడట. ఎందుకు అని బాలయ్య అడగగా ... ఆ సినిమాలో నా స్నేహితుడి పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. అది నీలాంటి గొప్ప ఈమేజ్ స్టార్ డమ్ ఉన్న హీరో నటిస్తే ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు. నీ ఈమేజ్ కి తగ్గట్టు కథలో మార్పులు , చేర్పులు చేసిన ప్రేక్షకులకు ఆ సినిమా నచ్చే అవకాశం ఉండదు. అందువల్ల ఆ సినిమాలో నువ్వు నటించకపోవడం మంచిది అని సలహా ఇచ్చాడట. దానితో బాలకృష్ణ కూడా ఆ సినిమాలో నటించను అని కే ఎస్ రవి కుమార్ కు చెప్పాడట. ఆలయ రజిని వల్ల బాలయ్య "కథానాయకుడు" సినిమా నుండి తప్పుకున్నాడట.