పుష్ప2 ఎఫెక్ట్ : శ్రీలీలను ఆ పని చేయమంటూ బలవంతం చేస్తున్న ఫ్యాన్స్.. చచ్చింది గొర్రె..!

Thota Jaya Madhuri
శ్రీ లీల .. ఈ పేరు చెప్తే ముందుగా జనాలు ఎప్పుడు కూడా చాలా ముద్దుగుమ్మ ..క్యూట్ బేబీ అని మాట్లాడేవారు . కానీ ఇప్పుడు శ్రీలీల అన్న పేరు వినపడితే మాత్రం కిస్సిక్ అంటూ ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు .పుష్ప 2 సినిమా చూసిన తర్వాత ఫోటో తీయండి అని ఎవరు అనడం లేదు .. కిసుక్కుమని తీయండి రా అంటున్నారు . అంతలా కిస్సిక్సాంగ్ బాగా జనాల నల నరాల్లోకి ఎక్కేసింది . మరీ ముఖ్యంగా ఈ స్పెషల్ సాంగ్ లో శ్రీలీల ఒళ్ళు తిప్పేసిన తీరు కుర్రాళ్ళకి మైండ్ బ్లోయింగ్ అయ్యేలా చేసింది .


అసలు శ్రీలీల ది నడుమా..? స్ప్రింగ్ గా..? ఏంటి అలా తిప్పేసింది ..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు. లిరికల్ వీడియోలో కొన్ని స్టెప్స్  మాత్రమే చూపించిన సుకుమార్ ఫుల్ వీడియోలో మాత్రం ఫుల్ మీల్స్ అందించేసాడు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. సినిమాకి శ్రీలీల పాట బాగా హైలైట్ గా మారింది . అయితే ఇదే మూమెంట్లో రీసెంట్గా శ్రీలీల పుష్ప సినిమా చూడడానికి థియేటర్స్ కి వచ్చింది.

 
అక్కడ శ్రీలీల కిస్సిక్ సాంగ్ రాగానే అందరూ ఆట పట్టించారు.  అంతేకాదు శ్రీ లీల లైవ్లో ఆ సాంగ్ కి పర్ఫామెన్స్ చేస్తే చూడాలని ఉంది అంటూ అరుపులు కేకలతో హోరెత్తించారు. అయితే శ్రీలీల మాత్రం సైలెంట్ గా నవ్వుతూ కామ్ గా అయిపోయింది . కెరియర్ పిక్స్ లో ఉండగానే శ్రీలీల ఇలా స్పెషల్ సాంగ్ లో నటించడం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది . ఇకపై ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది అంత ప్రశ్నార్ధకంగా మారిపోయింది..?? త్వరలోనే శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి..!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: