పుష్ప3లో విలన్ అతనేనా..చిన్న హింట్ తో క్యూరియాసిటీ పెంచేసిన సుకుమార్..!

Thota Jaya Madhuri
పుష్ప2 సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తట్టిన ప్రశ్న.. పుష్ప3 లో విలన్ అతనేనా..? పెళ్లి మండపంలో పుష్ప ఫ్యామిలీ అంతా సందడి సందడిగా ఉన్న మూమెంట్లో ఒక బొకే అక్కడికి వెళుతుంది . ఆ బొకేను  జగపతిబాబు పంపించాడు అన్న విధంగా మనకి ముందు సీన్ లో చూపిస్తారు డైరెక్టర్ సుకుమార్.  అయితే సడన్గా కొండమీద నుంచి బాంబ్ బ్లాస్ట్ చేసే విధంగా రిమోట్ కంట్రోల్ చేస్తాడు ఒక వ్యక్తి . ఆ వ్యక్తి పుష్ప3లో విలన్ అంటున్నారు జనాలు.


అయితే ఆయన బ్యాక్ లుక్స్ చూసి కచ్చితంగా అది సన్నీ డియోల్ అంటూ క్లారిటీకి వచ్చి మరి ట్రెండ్ చేస్తున్నారు . పుష్ప3 సినిమాలో సన్నీడియోల్ విలన్ అని మాట్లాడుకుంటున్నారు . . అయితే సుకుమార్  ఎందుకు పుష్ప2 సినిమాలో సన్ని డియోల్ ని ఒక్క సీన్ లో కూడా చూపించలేదు అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జగపతిబాబు ఫ్యామిలీకి సంబంధించిన వారిని పుష్ప రాజ్ ఎలా చంపేస్తాడో మనకు తెలిసిందే. క్రూరాతి క్రూరంగా చంపేశాడు.


అయితే జగపతిబాబు  ఫ్యామిలీకి వారసులు ఇక లేరు అనే విధంగా చూపించాడు సుకుమార్.  కానీ జగపతిబాబు సెటప్ కొడుకుగా ఈ సన్ని డియోల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.  పరోక్షకంగా  ఆయన కూడా జగపతిబాబుకు వారసుడే . ఆ కారణంగానే సన్ని డియోల్ ని తెరపై పూర్తిగా  చూపించలేదట.  అంతేకాదు పుష్ప3 స్టోరీని కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుంది అంటూ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.  చూడాలి మరి నిజంగానే సుకుమార్ సన్నీ డియోల్ ని పుష్ప3లో విలన్ గా పెట్టనున్నారా..? లేకపోతే ఇది జనాల అభిప్రాయం మాత్రమేనా..? తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే..! ప్రసెంట్ ఈ వార్త మాత్రం పుష్ప 3 పై హైప్స్ పెంచేలా చేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: