పుష్ప2 క్లైమాక్స్ ఆ విధంగా రాసుకున్న సుకుమార్ ..కానీ లాస్ట్ మినిట్లో చేంజ్..ఎందుకంటే..?

Thota Jaya Madhuri
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమా చాలామంది చూసేసి ఉంటారు . సూపర్ హిట్ సూపర్ హిట్ టాక్ రావడంతో చాలామంది జనాలు బన్నీ నటించడం పుష్ప2 సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . మరి ముఖ్యంగా జాతర ఎపిసోడ్ గురించి ఎంత చెప్పకున్నా అది తక్కువగానే ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ ఎపిసోడ్ సినిమా కే హైలెట్గా నిలిచింది . ఇంకా పక్కాగా చెప్పాలంటే సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ దక్కించుకోవడానికి కారణం కేవలం 50 నిమిషాల జాతర ఎపిసోడ్.


 రష్మిక పర్ఫామెన్స్ అయితే ఇరగదీసేసింది . ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ప 2 క్లైమాక్స్ సీన్ గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . సుకుమార్ పుష్ప 2  కథను వేరేలా రాసుకున్నారట . కానీ సమయానుసారం ఆ సీన్స్ లో ఆ విధంగా తెరకెక్కించకుండా తనకు తగిన విధంగా షూట్ చేస్తూ వచ్చారట . అంతేకాదు పుష్ప2 క్లైమాక్స్ కోసం ఏకంగా మూడు సీన్స్ అనుకున్నారట . కానీ ఫైనల్ గా రెండిటిని బాగా హైలెట్ చేయాలి అంటూ భావించారట. అయితే ఆ రెండు సీన్స్ కూడా క్లైమాక్స్ సీన్ గా రాకుండా వేరే క్లైమాక్స్ ను తెరపై చూపించాడు సుకుమార్.


నిజానికి భన్వర్ సింగ్ షెకావత్ చనిపోయిన తర్వాత అసలు పుష్పరాజ్ కి యాంటీగా ఉండే వాళ్లే లేరు. మంగళం శీను ..దాక్షాయిని సైలెంట్ అయిపోయారు . అయితే అక్కడితోనే సినిమాను ఎండ్ చేసేయాలి . పుష్ప రాజ్ సిండికేట్ రూల్ చేసే విధంగా మారిపోవాలి . ఇది మొదటగా సుకుమార్  అనుకున్న క్లైమాక్స్ . రెండవది భన్వర్ సింగ్ షెకావత్ చనిపోకూడదు . పుష్పపై కోపంతో పుష్పని చంపకుండా పుష్ప చేసే సంగ్లింగ్  ను ఆపేస్తూ ఒకానొక దాడిలో శ్రీవల్లి చనిపోవాలి .


అప్పటికే శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయి ఉండాలి ..ఆ కోపంతో బన్నీ - షెకావత్ పై రివెంజ్ తీర్చుకోవాలి. ఇదే మూమెంట్లో రెడ్ హ్యాండెడ్ గా పుష్పరాజ్ దొరికిపోతాడు . ఆ మూమెంట్లో బన్నీ తప్పించుకొని అడవుల్లోకి పారిపోతాడు . ఇది రెండో క్లైమాక్స్ . అయితే రెండిటిని కూడా పుష్ప 2 సినిమాలో చూపించలేదు సుకుమార్ . వేరే ఒక విధంగా చూపించాడు . పుష్ప రాజ్ కి ఇంటిపేరు వచ్చేలా  ఒక ఫైట్ సీన్ ని ఆడ్ చేశారు. అయితే ఇది ఓకే బాగానే ఉంది కానీ పుష్ప2 సినిమాకి ఆయన రాసుకున్న సెకండ్ క్లైమాక్స్ తో అదిరిపోయే రేంజ్ లో ఉండేది అని సినిమాపై ఇంకా క్యూరియాసిటీ పెంచేసి ఉండేది అని చెప్పుకొస్తున్నారు జనాలు. భ్న్వర్ సింగ్ షెకావత్ ని ను అలా చంపేయడం జనాలకి ఫన్నీగా ఉంది. అంతేకాదు  పుష్పరాజ్ - భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలను ఇంకా హైలైట్ గా చూపించి ఉంటే బాగుండేది అంటూ మాట్లాడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: