ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు ..టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరు సుకుమారా..? రాజమౌళినా..?
ఇక్కడే పెద్ద పెంట పెంట అయిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనే విషయం హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయికి తెలుగు ఖ్యాతిని తీసుకెళ్లిన రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టరా..? పుష్ప2 సినిమాతో ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన సుకుమార్ నెంబర్ వన్ డైరెక్టరా..? ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. అయితే చాలామంది రాజమౌళిని సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీకి ఫస్ట్ ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన రాజమౌళి నెంబర్ వన్ అంటున్నారు .
అయితే సుకుమార్ అభిమానులు సైతం ఒక కోణంలోనే కాదు రెండో కోణంలో కూడా ఆలోచించండి.. పుష్ప2 సినిమాలో బన్నీ చేత అలా పెర్ఫార్మ్ చేయించాలి అనే ధాట్ రావడం నిజంగా చాలా గ్రేట్ . అలాంటి ఒక ఘనత అందుకున్నాడు సుకుమార్ . సుకుమార్ నే నెంబర్ వన్ డైరెక్టర్ అంటున్నారు . చూడాలి మరి రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసి చూపిస్తాడో..? మరి మీ దృష్టిలో ఎవరు ఇండస్ట్రీ నెంబర్ వన్ డైరెక్టర్ అనుకుంటున్నారు రాజమౌళినా..? సుకుమార్ నా..?