టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే చిన్న సినిమాలతో వచ్చి ఇప్పుడు స్టార్ హీరోలను సైతం తన వైపు తిప్పుకొని స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరాడు. ఇక అనిల్ రావిపుడి టాలీవుడ్ లో నాలుగు స్థంబాలాట ఆడుతున్నాడు. ఆల్రెడీ రెండు స్తంభాల్లాంటి వెంకీ, బాలయ్యతో మూవీలు తీశాడు.. ఇక మిగిలింది మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునానే.. ఇప్పడు మెగా ఆఫర్ తో అనిల్ రావిపుడి లెక్కే మారేలా ఉందట. ప్రాజెక్ట్ ఓకే అయ్యిందట.భగవంత్ కేసరి అంటూ దసరాను టార్గెట్ చేశాడు అనిల్ రావిపుడి. అలా బాలయ్యతో చేసిన ప్రయోగంతో నవరాత్రికి కాసుల పంటే అంటున్నాడు. ఆల్రెడీ వెంకటేష్ తో ఎఫ్ 3 హిట్ తో స్వింగ్ లో ఉన్న తనకి, ఈ సారి హిట్ పడితే, మూడో హ్యాట్రిక్ కి గేట్లు తెరుచుకున్నట్టే అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇండస్ట్రీకి నాలుగుస్థంబాల్లాంటి వాళ్లు చిరు, నాగార్జున, బాలయ్య, వెంకటేష్.. ఇందులో ఇప్పటికే ఇద్దరితో సినిమాలు తీసేశాడు అనిల్ రావిపుడి. కొత్తగా చిరుతో సినిమా తీసే ఛాన్స్ పట్టాడు. చిరు కూడా త్రివిక్రమ్ స్క్రిప్ట్ కి జై చిరంజీవ అంటూ కామెడీ దాడి చేసి చాలా కాలమైంది. ఇప్పుడు అనిల్ రావిపుడి మేకింగ్ లో దిల్ రాజు తీసే సినిమా పట్టాలెక్కితే, లెక్క మారిపోతుంది. పెద్ద హీరోలతో కామెడీ కమ్ యాక్షన్ డ్రామా జోనర్లో సక్సెస్ సొంతం చేసుకుంటున్న దర్శకుడిగా అనిల్ కి మంచి రికార్డు ఉంది.
ఇక మెగాస్టార్ తో అనిల్ రావిపుడి సినిమాకు తమన్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్, మరోసారి మెగాస్టార్ కోసం మ్యూజికల్ మ్యాజిక్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఆమధ్య చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ కోసం తమన్ సంగీతం అందించారు.అయితే ఈ సినిమా మ్యూజిక్ అనుకున్నంత స్థాయిలో క్లిక్కవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ, చిరు మళ్ళీ తమన్‌కే ఛాన్స్ ఇవ్వడం వెనుక కారణం అనిల్ రావిపూడి అని తెలుస్తోంది. తమన్‌తో అనిల్ రావిపూడికి మంచి స్నేహం ఉంది, తన సినిమాలకు తమన్ సంగీతం పెద్ద ప్లస్ అవుతుందని అనిల్ నమ్మకం ఉన్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిల్ ప్లస్ అయ్యింది. అనిల్ రావిపూడి సినిమా అంటే మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఈ క్రమంలో తమన్ బాణీలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.ఇక ఈ ప్రాజెక్ట్ 2025 సమ్మర్ అనంతరం ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది.ప్రస్తుతం అనిల్ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం.. అనే సినిమాని రెడీ చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ విశ్వంభర తో బిజీగా ఉన్నారు.