పుష్ప2 సినిమాలో సుకుమార్ చేసిన తప్పులివే.. వాళ్లను బాగా నిరాశపరిచాడుగా!

Reddy P Rajasekhar
అల్లు అర్జున్ సుకుమార్ కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కాగా ఈ కాంబో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్య, ఆర్య2, పుష్ప, పుష్ప2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే పుష్ప2 సినిమాలో సుకుమార్ మార్క్ కనిపించలేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. పుష్ప2 సినిమాలో సుకుమార్ చేసిన తప్పులకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
సాధారణంగా సుకుమార్ సినిమాలలో స్క్రీన్ ప్లే విభిన్నంగా ఉంటుంది. బ్రిలియంట్ స్క్రీన్ ప్లేతో సుకుమార్ చాలా సందర్భాల్లో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారనే సంగతి తెలిసిందే. అయితే పుష్ప2 సినిమాలో ఒకటి రెండు సన్నివేశాల్లో మినహా సుకుమార్ తెలివితేటలు ఎక్కడా కనిపించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుకుమార్ ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
 
సెకండాఫ్ మొత్తం మీద చాలా తక్కువ సంఖ్యలో సీన్లు ఉన్నాయని పుష్ప3 కోసం పుష్ప2 సినిమాను సాగదీశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప3 కోసం ఎదురుచూసేంత ప్రత్యేకతలు ఏవీ సినిమాలో లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 సినిమా కలెక్షన్ల పరంగా అదరగొడుతున్నా క్లాస్ ప్రేక్షకులను, సుకుమార్ ఫ్యాన్స్ ను ఈ సినిమా మెప్పించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
పుష్ప ది రూల్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉందని అయితే కమర్షియల్ గా ఈ సినిమా రేంజ్ ఏంటో తెలియాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల్లోనే పుష్ప ది రూల్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోగా వీకెండ్ తర్వాత ఈ సినిమా రేంజ్ ఏంతనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం పెరుగుతోంది. పుష్ప ది రూల్ మూవీ బన్నీ ఫ్యాన్స్ కు మాత్రం ఎంతగానో నచ్చేసింది. బన్నీ కెరీర్ లో ఇలాంటి సినిమా లేదని అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: