వావ్: పెళ్లి చేసుకోబోతున్న యాంకర్.. వరుడు ఎవరంటే..?
వారిలో విష్ణు ప్రియ, ప్రేరణ, నబీల్, గౌతమ్, నిఖిల్, అవినాష్. వీరిలో అవినాష్ మొదటి ఫైనలిస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐదు మందిలో విష్ణు ప్రియ ఈరోజు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇక మిగిలిన 5 మంది టాప్ పైకి వెళ్తారని సమాచారం. ఇదిలా ఉండగా వీరిలో ప్రేరణ చాలా అద్భుతంగా ఆట ఆడుతూ మంచి ఫ్యామిలీ హౌస్ వైఫ్ మెటీరియల్ అనిపించుకుంది.
తన అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఇంకొక వైపు తన వ్యక్తిగత జీవితం పై ఎటువంటి నెగిటివిటీ మార్కు పడకుండా ముందుకు సాగుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఆమె క్యారెక్టర్ ను మెచ్చిన ప్రముఖ యాంకర్ ఓంకార్ ఈమెకు మరో అవకాశాన్ని కల్పించారు. ఇటీవల హౌస్ లోకి వచ్చిన ఓంకార్ ప్రేరణతో ఒక మాట తీసుకున్నారు. అందులో భాగంగానే నేను మీ కోరిక తీర్చను కదా మీరు కూడా నా కోరిక తీర్చాలి అంటూ ప్రేరణను అడిగారు ఓంకార్.తప్పకుండా తీరుస్తాను ఏమిటా కోరిక అంటూ ప్రేరణ అడిగింది. వెంటనే ఓంకార్ చెబుతూ మొన్న జోడి టాస్క్ లో డాన్స్ చేయమన్నప్పుడు మీరు మీ భర్త పాత్రను ఎవరు భర్తీ చేయలేరు అని చెప్పి ఒంటరిగా డాన్స్ చేశారు కదా.. అసలు మీ పెళ్లి జరిగి ఎన్ని రోజులు అయింది అంటూ అడిగాడు ఓంకార్. నవంబర్ 22 కి సంవత్సరం అయింది అంటూ ఆమె తెలిపింది.
ఇక్కడ మీ క్యారెక్టర్ కి నేను పడిపోయాను. మీలాంటి వాళ్లే షోకి రావాలి. మీ వల్ల చాలామందికి ఎన్నో నేర్పిన వాళ్ళు అవుతాము. త్వరలో వచ్చే ఇస్మార్ట్ జోడి సీజన్ 3 కి మీరు మీ భర్తతో కలిసి హాజరు కావాలి అంటూ కోరారు ఓంకార్.ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి..