డాకు మహారాజ్ : బాలయ్య కోసం రవితేజ.. బ్లాక్బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్స్..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వం లో డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు . ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... డాకు మహరాజ్ సినిమాలో బాలయ్య కు సంబంధించిన కొన్ని సన్నివేశాలకు మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే బాబి , రవితేజను సంప్రదించగా ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే బాబి రవితేజ హీరోగా రూపొందిన పవర్ అనే సినిమాతో దర్శకుడుగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇకపోతే బాబి ఆఖరుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగారు పొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో రవితేజ , చిరంజీవి కి సోదరుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుండడంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: