ఆ ఇద్దరు హీరోయిన్లతో మంచు విష్ణు రిలేషన్.. నిజమేనా.?

Pandrala Sravanthi
సినీ ఇండస్ట్రీ లో మంచి పేరున్న ఫ్యామిలీ లలో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. వీరిలో మోహన్ బాబు కి ఉన్నంత పేరు కొడుకులు తెచ్చుకోకపోయినప్పటికీ మంచు విష్ణు మాత్రం మా అసోసియేషన్ అధ్యక్షుడి గా అంతో ఇంతో ఇండస్ట్రీ లో ఫేమస్ అయ్యారు. అలాంటి మంచు విష్ణు సినీ కెరియర్లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సినిమాలు ఉన్నాయి. అయితే సహజంగానే చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్ల తో  సినిమాలు చేసే సమయం లో వారి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు వస్తే ఇద్దరి మద్య ఏదో ఉంది అనే రూమర్లు వినిపించడం జరుగుతుంది. అలా మంచు విష్ణు కు కూడా ఇద్దరి హీరోయిన్ల తో ఇలాంటి వార్తలే వినిపించాయి. 

అందులో మొదటి హీరోయిన్ జెనీలియా రెండో హీరోయిన్ హన్సిక.. జెనీలియా మంచు విష్ణు కాంబినేషన్లో ఢీ సినిమా వచ్చింది. ఈ సినిమా మంచు విష్ణు కి మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో జెనీలియా తో మాట్లాడడానికి మంచు విష్ణు ఎక్కువగా ఇష్టపడేవారట. షూటింగ్ ముగిసాక లంచ్ చేసే సమయం లో కూడా ప్రతిసారి ఎదురుగా కూర్చుని మాట్లాడుకుంటూ తినేవారట.

 ఆ సినిమా లో చేసిన శ్రీహరి నీ కోసం ఇంటి నుండి  మటన్ పాయా తీసుకువచ్చాను ఇక్కడికి రా అన్నా కూడా వినకుండా లేదు అంకుల్.. నేను ఇదే తింటాను అంటూ జెనీలియా తో క్లోజ్ గా ఉండే వారట. అలా కొద్ది రోజులు వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఆ తర్వాత జెనీలియా రితేష్  దేశ్ముఖ్ ని పెళ్లి చేసుకుంది. అలాగే దేనికైనా రెడీ సినిమా చేసే సమయం లో ఆపిల్ బ్యూటీ హన్సిక తో కూడా మంచు విష్ణు కి ఎఫైర్ వార్తలు వినిపించాయి. కానీ అప్పటికే మంచు విష్ణు కి పెళ్లి అయిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: