స్టార్ హీరోయిన్ తమన్నా అందుకున్న తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా...సినిమాకు అనుకుంటే పొరపాటే..!

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా ఎంట్రి ఇచ్చి సక్సెస్ సాధించిన వారు ఎంద‌రో ఉన్నారు .. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న కూడా ఒకరు .. ఈమె గురించి ఎంత చెప్పుకున్న తక్కువే .. తన అందం అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది మిల్కీ బ్యూటీ .. మూడు పదుల వయసు దాటుతున్న కూడా ఈ ముద్దుగుమ్మ కొత్తగా వచ్చే హీరోయిన్లకు తీసిపోని అందంతో వ‌రుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది .. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస‌ సినిమాల్లో నటిస్తూ దుమ్మురేపుతుంది .. ఇక తమన్నకు ఒక తెలుగులోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా రాణిస్తుంది.

ఇక తమన్నా టెన్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లోనే తెలుగులో సినిమా అవకాశం వచ్చిందట .. అంతేకాకుండా అప్పట్లోనే ప‌లు యాడ్స్ లో కూడా ఈమె నటించి వరుస అవకాశాలు తెచ్చుకుంది .. ప్రస్తుతం తమన్నా తను నటించే ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది. మరీ ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో నటిస్తే కోటి రూపాయలకు పైనే తీసుకుంటుంది. ఇదే క్రమంలో తమన్నా మొదటిసారి వెండి తెరపై నటించినందుకు సుమారు లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుందట.

2005లో వచ్చిన ఒక కమర్షియల్ య‌డ్స్‌ కోసం మూడు రోజులు తన కాల్ షీట్స్ ఇస్తే అందులో నటించినందుకు ఆమె లక్ష రూపాయల రెమ్యూనరేషన్ అందుకుందట తమన్న .. ఇదే విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ ముందుగమా చెప్పకు వచ్చింది .. తనుకు వచ్చిన మొదటి లక్ష రూపాయలను తన కుటుంబంతో ఖర్చు చేసినట్టు తమన్న ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో తన మొదటి హిట్ను అందుకుని టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా దూసుకుపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: