హమ్మయ్య..బన్నీ తప్పించుకున్నాడు.. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి..?

Thota Jaya Madhuri
సినీ స్టార్స్ ఈ మధ్యకాలంలో ఇంట్లో వాళ్లకు భయపడుతున్నారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాకు మాత్రం బాగా భయపడుతున్నట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా కొంతమంది పాన్ ఇండియా స్టార్స్ ని సోషల్ మీడియాలో ఎలా ఏకేస్తున్నారో జనాలు మనం చూస్తూనే వస్తున్నాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతూ వచ్చింది . మెగా ఫ్యామిలీకి అదే విధంగా అల్లు ఫ్యామిలీకి అస్సలు పడడం లేదు అని ..ఆ కారణంగానే పుష్ప 2 సినిమాకి ఎవరు సపోర్ట్ చేయలేదు అంటూ బాగా ఘాటుగా వార్తలు అలాగే కామెంట్ లు వినిపించాయి .


అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీపై మెగా ఫాన్స్ మండిపడుతున్న మూమెంట్ లో పవన్ ఫ్యాన్స్ మాత్రం కూల్ అయిపోయారు అని తెలుస్తుంది. దానికి కారణం సక్సెస్ సెలబ్రేషన్స్ మీట్లో బన్నీ-పవన్ కళ్యాణ్ కి స్పెషల్ గా థాంక్యూ చెప్పడమే . తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి థాంక్యూ చెబుతూనే ఏపీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబునాయుడు కి థాంక్యూ చెబుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కూడా థాంక్స్ చెప్పారు. అండ్ మై పర్సనల్ నోట్ పవన్ కళ్యాణ్ బాబాయ్ కి అంటూ థాంక్స్ చెప్పారు .


దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం కూల్ అయ్యారు . అయితే బన్నీ తెలివిగా పవన్ కళ్యాణ్ కు చట్టప్రకారంగా థాంక్స్ చెప్పి తప్పించుకున్నాడు . ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తాడా ..? ఇవ్వడా..? ఇదే ప్రశ్నార్ధకంగా మారింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా అయితే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఫ్యామిలీ పరంగా కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ పరంగా కూడా రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు . కానీ సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతలు బేస్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో ఎవరు మంచిగా ఎదుగుతున్న సపోర్ట్ చేస్తే క్యారెక్టర్ ఉంది గనుక కచ్చితంగా పవన్ కళ్యాణ్ పుష్ప 2 సినిమా పై రియాక్ట్ అవ్వాలి. అలా రియాక్ట్ అయితేనే బాగుంటుంది . అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పుష్ప2  పై రియాక్ట్ అవుతాడా..? అవ్వడా ..? అనేది ప్ర్శ్నార్ధికంగా మారింది..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: