నయనతార లాగే మరో స్టార్ హీరోయిన్ కూడా..ఇంత షాక్ ఇచ్చింది ఏంటి..?

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ స్టార్స్ పిల్లలను కనడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. పిల్లల్ని కనాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటున్నారో.. లేకపోతే ప్రెగ్నెన్సీ వస్తే ఆ తర్వాత బాడీలోని హార్మోన్స్ చేంజ్ అయి అందం తగ్గిపోతుంది అని భావిస్తున్నారో.. రీజన్ ఏంటో తెలియదు కానీ కొంతమంది ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి ఇష్టపడడం లేదు . చాలామంది లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా కనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి కొంతమంది సరోగసి ప్రాసెస్ ద్వారా ముందుకు వెళ్తున్నారు.


ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ వస్తే హార్మోన్స్ మారీ లావు అయిపోతాము ఏమో అన్న  భయం తో సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ పిల్లలను కన్నారు. కానీ అందరికన్నా హైలైట్ గా నిలిచింది మాత్రం నయనతార జంట అని చెప్పాలి . నయనతార - విగ్నేశ్ శివన్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే నయనతార పెళ్లి అయిన నాలుగు నెలల కే తల్లైంది. అది కూడా సరోగసి ప్రాసెస్ ద్వారా తమిళనాడు గవర్నమెంటు నుంచి చిక్కులు కూడా ఎదుర్కొంది .


కానీ తన టాలెంట్ తో అన్ని సరిచేస్తూ తన బిడ్డలు తనకే సొంతం అనే విధంగా లీగల్ డాక్యూమెంట్స్ చూపించింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మరొక హీరోయిన్ ఇదేవిధంగా సరోగసి ప్రాసెస్ ద్వారా తల్లి కాబోతుంది అన్న  వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఆమె మరి ఎవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్ . సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ఉంది . రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ నికోలైజ్ సచ్ దేవ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆల్రెడీ ఆయన కి ఓ బిడ్డ ఉంది . అయితే ఇప్పుడు సరోగసి ప్రాసెస్ ద్వారా వరలక్ష్మి శరత్ కుమార్ తల్లి కాబోతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియనప్పటికీ వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి స్టార్ ఇలాంటి డెసిషన్ తీసుకుందా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు . చూడాలి మరి దీనిపై వరలక్ష్మి శరత్ కుమార్ ఎలా స్పందిస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: