ఆ హీరోయిన్ మీద కోపంతో రేణు దేశాయ్ తో పెళ్లి.. పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్.?

Pandrala Sravanthi
ఏంటి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా.. వాళ్ళది ట్రూ లవ్ కాదా.. ఆ హీరోయిన్ మీద కోపంతోనే రేణు దేశాయ్ మెడలో తాళి కట్టారా.. ఇంతకీ ఆ డైరెక్టర్ చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.ఒకప్పుడు స్టార్ట్ డైరెక్టర్ గా ఎన్నో హిట్ సినిమాలు తీసిన గీత కృష్ణ ప్రస్తుతం ఎవరు ఆఫర్స్ ఇవ్వకపోవడంతో డైరెక్షన్ కి స్వస్తి చెప్పి యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో సంచలన విషయాలు బయటపెడుతున్నారు. అలా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా కృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లపై సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పవన్ బద్రి సినిమా సమయంలో రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

బద్రి సినిమా షూటింగ్లో పవన్ మొదట అమీషా పటేల్ ని ప్రేమించాడు. వీరిద్దరూ చాలా రోజులు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయిని సినిమాలు చేయకని చెప్పాడు. కానీ ఆమె మాత్రం నో నేను సినిమాలు చేస్తానని చెప్పడంతో కోపంతో రచ్చ రచ్చ చేసారట.ఆ తర్వాత ఆమె మీద కోపం తెచ్చుకొని అదే సినిమాలో హీరోయిన్ గా చేసిన రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం మొత్తం నాకు త్రివిక్రమరావు చెప్పారు. ఆరోజు పవన్ కళ్యాణ్ అలా బిహేవ్ చేశారని ఆయన నాకు పూస గుచ్చినట్టు చెప్పారు. అంతేకాదు వారిద్దరిది ట్రూ లవ్ కాదు. ఆ హీరోయిన్ మీద కోపంతోనే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మెడలో తాళి కట్టాడు.

ఇక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ జీవితంలోకి వచ్చాక ఆయన జీవితం అంత బాగాలేదు.  అలాగే రేణు దేశాయ్ ని చిరంజీవి ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంతేకాదు రేణు దేశాయ్ ఆయన జీవితంలో అడుగుపెట్టినప్పటి నుండి అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.అలా దాదాపు పది సినిమాలు ప్లాప్ అయ్యాయి.దీంతో సెంటిమెంట్ ప్రకారం రేణు ఆయనకు సెట్ అవ్వలేదు అని అందరూ అన్నారు అంటూ సంచలన విషయాలు బయట పెట్టారు డైరెక్టర్ గీత కృష్ణ.ప్రస్తుతం ఈయన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో నిజంగానే రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ నిజంగా ప్రేమించలేదా.. అమీషా పటేల్ మీద ఉన్న కోపంతోనే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మెడలో తాళికట్టారా అంటూ నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: