తాజాగా మంచు ఫ్యామిలీలో విభేదాలు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త భగ్గుమన్న సంగతి మనకు తెలిసిందే.. మంచు మనోజ్ గాయాలతో వెళ్లి మరీ పోలీస్ స్టేషన్లో తన తండ్రి మోహన్ బాబుపై కేస్ పెట్టి నన్ను నా భార్యని నా తండ్రి కొట్టాడు అంటూ ఫిర్యాదు చేశారంటూ వార్తలు వినిపించాయి. అయితే మనోజ్ మాత్రమే కాదు మోహన్ బాబు కూడా మనోజ్ పై నా కొడుకు నా మీద దాడి చేశాడంటూ కేసు పెట్టినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్త క్షణాల్లోనే సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యింది. కానీ ఈ వార్తలు నిజం కాదు అంటూ వెంటనే స్పందించింది మంచు ఫ్యామిలీ పిఆర్ టీం.. మంచు ఫ్యామిలీ పిఆర్ టీం స్పందిస్తూ.. మంచు మనోజ్ మోహన్ బాబు ఇద్దరు గొడవ పెట్టుకున్నారని, ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నారు అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఇలాంటి అవస్తవాలను ప్రచారం చేయకండి.
కొంతమంది మీడియా వాళ్ళు ఈ వార్తలను మరింత హైలెట్ చేస్తున్నారు వాటిని ఇప్పటికైనా ఆపేయండి. అందులో ఎలాంటి నిజం లేదు అని స్పందించారు. కానీ చాలామంది మంచు ఫ్యామిలీ పీఆర్ టీం చెప్పిన మాటలు నమ్మడం లేదు. ఎందుకంటే మళ్లీ కవర్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇక దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే.. మా మధ్య గొడవలు ఏమీ లేవు అవి పుకార్లు మాత్రమే అని మంచు ఫ్యామిలీలోని మోహన్ బాబు, మంచు విష్ణు లు స్పందిస్తున్నారు తప్ప మంచు మనోజ్ ఎక్కడా కూడా చెప్పడం లేదు. ఇక మంచు మనోజ్ స్పందించి గొడవలు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అని చెబితే నిజంగానే అని నమ్ముతారు. కేవలం మోహన్ బాబు తరపున ఉన్న విష్ణు, మోహన్ బాబులు మాత్రమే స్పందించడంతో మంచు ఫ్యామిలీ లో గొడవ జరిగింది నిజమే.
అందుకే మనోజ్ స్పందించడం లేదు. ఈ విషయం బయటికి రాకూడదనే మోహన్ బాబు విష్ణులు మళ్లీ కవర్ చేయాలని చూస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ గొడవలన్నీంటికి కారణం కొంతమంది విష్ణు భార్య విరాణిక అంటే మరి కొంత మంది మనోజ్ భార్య భూమా మౌనిక అంటున్నారు. అయితే మనోజ్ మౌనికని పెళ్లి చేసుకోవడం మంచు విష్ణు, విరాణికకి ఎవరికి ఇష్టం లేదు.ముఖ్యంగా మంచు విష్ణుకి ఆయన భార్యకి.. అప్పటినుండే వీరి మధ్య గొడవలు భగ్గుమన్నాయి అని తెలుస్తుంది. ముఖ్యంగా విరాణికా వీరి మధ్య చిచ్చు పెడుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరి కొంతమందేమో మౌనిక మోహన్ బాబు ఫ్యామిలీతో మనోజ్ ని కలవనివ్వకపోవడం వల్లే గొడవలు అవుతున్నాయి అని అంటున్నారు. అయితే ఈ గొడవల వెనుక ఉన్న మహిళ ఎవరో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్లో తెగచక్కర్లు కొడుతుంది