సమంత ఇక సినిమాలు వదిలేస్తుందా..?
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏమిటి .. అని సడన్గా అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం. గుణశేఖర్ దర్శకత్వం లో ఆమె నటించిన శాకుంతలం అతిపెద్ద డిజాస్టర్. ఈ సినిమా సమంత పరువు పూర్తిగా తీసేసింది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ఈ సినిమా తో ఆమె భారీగా ట్రోల్స్ ఎదుర్కొంది. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మలయాళంలో సినిమా చేసేందుకు ఆమె ఒప్పుకుంది. మరోవైపు సొంత బ్యానర్‌పై ఒక సినిమా ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చి చాలా రోజులైనా .. అప్డేట్ లేదు. కనీసం పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ చేస్తుందని అనుకున్నా .. ఆమెను పక్కనపెట్టి శ్రీలీలతో చేయించారు. మధ్యలో ఓటీటీలో మాత్రం.. బిజీ అవుతుంది సమంత. దానికోసం ఎడతెగని ప్రచారం చేసింది.
ఓ సినిమాకు కూడా ఎప్పుడు సమంత ఈ స్థాయిలో ప్రచారం చేయలేదు. సిటాడెల్ వేడి చల్లారింది. దీంతో ఆమె తన కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తుందని .. ఆమె సినిమాలు సెట్స్ మీదకు వెళతాయని అంతా ఎదురు చూశారు. కానీ .. మరో ఓటిటి వెంచర్‌కు డేట్ ఇచ్చింది సమంత. ఈరోజు నుంచి అది మొదలైంది. ఇవన్నీ చూస్తుంటే సమంతకు సినిమాలపై ఆసక్తి తగ్గిందేమో అనిపిస్తుంది. పైగా లవ్ సీన్లు చేయడం కంటే.. యాక్షన్ సీక్వెన్సు లు చేయటమే తనకు ఇష్టం అంటూ వెల్లడించింది. ఇదిలా ఉంటే సమంతకు విడాకులు ఇచ్చేసిన మాజీ భర్త నాగచైతన్య .. మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను తాజాగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ .. సమంత మాత్రం ఇంకా సింగల్ గా అలాగే ఉండిపోతున్న పరిస్థితి. మరి సమంత కెరీర్ ఎప్పుడు ఎలా ? టర్న్ అవుతుందో ? చూడాలి.