"ఆ సీన్ నేను చేయలేను సార్ అంటూ సుక్కుని వేడుకున్న రష్మిక".. ఆ సీనే సూపర్ సూపర్ హిట్..!

Thota Jaya Madhuri
పుష్ప2 సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఓ రేంజ్ లో అల్లు అర్జున్ కెరీర్ ని టర్న్ చేసింది. ఇప్పుడు అందరూ కూడా బన్నీ రష్మిక మందన్నా ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఇంటికి వెళ్లి మరి పుష్ప సినిమాలోని  సీన్స్ లో గుర్తుచేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే సోషల్ మీడియాలో ఒక హాట్ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమాలో ఒక సీన్ చేయను అంటూ రష్మిక మందన్నా చాలా చాలా మొండి చేసిందట .


అలా చేస్తే బన్ని ఫ్యాన్స్ నన్ను తిడతారు సార్ అంటూ బాగా ఇబ్బంది పడిందట . కానీ సుకుమార్ మాత్రం అసలు ఒప్పుకొనే ఒప్పుకోను.. ఆ సీను నువ్వే చేయాలి అంటూ మొండి పట్టుదలగా చేయించారట.  ఆ సీన్ మరి ఏదో కాదు రష్మిక మందన్నా కాళ్లని పట్టుకునే సీన్. రష్మిక మందన్నా కూర బాగాలేదు అని ..బన్నీ చెప్పగానే కోపంతో లోపలికి వెళ్లి కూర మొత్తం పాడేస్తుంది శ్రీవల్లి..అదేమూమెంట్ లో రష్మిక మందన్నా కొంచెం ఫైర్ గా నడుస్తూ ఉన్నా మూమెంట్లో ఆమె కాలికి దెబ్బ తగులుతుంది .


అప్పుడు బన్నీ పసుపు పెట్టి మరి ఆమె కాళ్లని పట్టుకుంటాడు . అంతేకాదు తన సిగ్నేచర్ డైలాగ్ తగ్గేదేలా అంటూ కాళ్ళతో చెప్తాడు . డైలాగ్ బాగా హిట్ అయ్యింది . అయితే బన్నీ అలా హీరోయిన్ కాళ్లు పట్టుకోవడం ఏంటి అంటూ కొంతమంది ట్రోల్ కూడా చేశారు . కానీ చాలామంది దాన్ని భార్య కాళ్లు భర్త పట్టుకుంటే తప్పు లేదన్న విధంగానే చూస్తారు . ఈ సీను మాత్రం రష్మిక మందన్నా చేయలేను సార్ బన్ని అభిమానులు ఫీల్ అవుతారు..నన్ను ట్రోల్ చేస్తారు అంటూ బాధపడిందట . కానీ సినిమా రిలీజ్ అయ్యాక అలాంటిది ఏదీ జరగలేదు. సుకుమార్ ఆ విషయంలో బాగా ఆలోచించి ముందు స్టెప్ తీసుకున్నాడు అంటున్నారు సినీ ప్రముఖులు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: