భర్తపై మొదటిసారి అలాంటి వ్యాఖ్యలు చేసిన శోభిత..!

Divya
టాలీవుడ్ హీరోయిన్ శోభిత, నాగచైతన్య వివాహం ఈ నెల నాలుగవ తేదీన చాలా గ్రాండ్గా జరిగింది.. వీరికి సంబంధించి కొన్ని ఫోటోలను శోభిత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకుంది.. శోభిత తన భర్త పైన శోభిత మాట్లాడుతూ.. ఇతరుల పట్ల మర్యాదగా హుందాగా ప్రవర్తించే లక్షణాలు తన భర్త చైతన్యలో తనకు బాగా నచ్చుతాయని.. అతడి సింప్లిసిటీ తనకు బాగా నచ్చుతుందని తెలియజేసింది. తమ వివాహ వేడుక నుంచి మొదటి ఫోటోలను షేర్ చేస్తూ శోభిత ఇలా తెలియజేసింది.

చైతన్య లాంటి భర్త తనకు దొరకడం చాలా అదృష్టమని తనను అతడు ఎంతో బాగా చూసుకుంటాడని ప్రేమగా ఉంటాడని విషయాన్ని తెలియజేసింది శోభిత.. శోభిత షేర్ చేసిన ఫోటోలలో ట్రెడిషనల్ వధూవరుల గెటప్ లు అందరిని ఆకట్టుకుంది. వీరిద్దరి వివాహ ఆచారాలను నిర్వహించే ఫోటోలు కూడా చాలా చూడచక్కగా ఉన్నాయని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.. మరొక ఫోటోలో శోభిత మెడలో దండ వేయడానికి ప్రయత్నించినప్పుడు శోభిత వెనకకు వంగి మరి కనిపిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకరు చూసుకుని మురిసిపోయిన ఈ జంట వివాహ వేడుకలు శోభిత నెల పై కూర్చున్నప్పుడు తన భర్తను తాకేందుకు చూస్తూ కనిపించింది శోభిత.

శోభిత సినీ కెరియర్ల అవకాశాల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొందని అందంగా లేవని ఆకర్షణీయమైన ముఖం కాదని చాలామంది ఆమెను అవమానించారట..ఒకానొక ప్రముఖ కంపెనీ వాణిజ్య  ప్రకటన కోసం వెళితే కనీసం నువ్వు బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అనే విధంగా అవమానించారని కేవలం పట్టుదల కృషితోనే ఆమె ఇప్పుడు అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారాను అంటూ శోభిత తెలియజేసింది.. ఇక మీదట తనకు నచ్చిన పాత్రలే చేస్తానని తెలియజేసింది.. అలాగే నాగచైతన్య కూడా పెళ్లి అనంతరం తనకు ఇద్దరు పిల్లలు చాలని .. వారితో తన చిన్ననాటి ఆనందాలను ఆస్వాదిస్తానంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: