జానీ మాస్టర్ కి పెద్ద షాక్.. డ్యాన్సర్స్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగింపు.?

Pandrala Sravanthi
 గత కొద్దిరోజుల ముందు జానీ మాస్టర్ ఇష్యూ మీడియాలో ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన అమ్మాయిని లైంగికంగా వేధించాడు అంటూ ఆమె కేసు పెట్టడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ఓవైపు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసిన అమ్మాయి మరోవైపు జానీ మాస్టర్ భార్య ఇద్దరు ఒకరిపై ఒకరు ఎన్నో ఆరోపణలు చేసుకున్నారు.ఇక జానీ మాస్టర్ కి మద్దతుగా కొంతమంది నిలిస్తే ఆయనకి వ్యతిరేకంగా మరికొంతమంది ఉన్నారు. ముఖ్యంగా జానీ మాస్టర్ అరెస్టు వెనుక అల్లు అర్జున్ ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు అని కొట్టిపారేశారు. అయితే జానీ మాస్టర్ జానీ మాస్టర్ జైలు జీవితం గడిపాక కొద్ది రోజులకే ఆయనకు బెయిల్ వచ్చింది.బెయిల్ మీద బయటికి వచ్చిన ఈయనకి తాజాగా పెద్ద షాక్ తగిలినట్టు అయింది. 

జానీ మాస్టర్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూ తాజాగా ఆయన జీవితంపై కోలుకోలేని దెబ్బపడిందని చెప్పుకోవచ్చు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. జానీ మాస్టర్ ఇక కొరియోగ్రఫీకి పూర్తిగా దూరమవ్వాల్సిందే.ఎందుకంటే తాజాగా డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానీ మాస్టర్ ని డాన్సర్స్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగించేశాడు. తాజాగా డ్యాన్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఆదివారం రోజు డాన్స్ డైరెక్టర్స్ మరియు డాన్సర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగాయి. అయితే ఈ ఎలక్షన్స్ లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే ఈయన ఇప్పుడే కాదు గతంలో నాలుగు సార్లు కూడా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

అలా ఈయన ఐదోసారి అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు.అయితే ఈయన అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతోనే జానీ మాస్టర్ ని డాన్సర్స్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగించారట. అయితే ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది జానీ మాస్టర్ అభిమానులు అసలు కేసులో ఎంత నిజం ఉంది అనే వివరాలు పూర్తిగా తెలియక ముందే ఆయన్ని ఎలా అసోసియేషన్ నుండి తొలగిస్తారు.పూర్తి విచారణ జరిగాకే తొలగించాల్సింది. కానీ పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తుండగానే ఆయన్ని తొలగించడం ఏమాత్రం బాగోలేదని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: