ఏకంగా 10 బ్లాక్బస్టర్ లను రిజెక్ట్ చేసిన తారక్.. అవి చేసుంటే మామూలుగా ఉండేది కాదు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో దాదాపు పది బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం నితిన్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో దిల్ అనే బ్లాక్ బాస్టర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఆఫర్ మొదటగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి రాగా ఆయన మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆర్య మూవీ బ్లాక్ బస్టర్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఆఫర్ కూడా మొదట తారక్ కి వచ్చిందట. కానీ ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతనొక్కడే సినిమా ఆఫర్ కూడా మొదటి తారక్ కి రాగా ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే బ్లాక్ బస్టర్ విజయం సాధించిన భద్ర మూవీ కథ కూడా మొదట తారక్ వద్దకి రాగా ఆయన రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన కృష్ణ మూవీ కథ కూడా మొదట తారక్ వద్దకు రాగా ఆయన దాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

అలాగే కిక్ మూవీ ని కూడా తారక్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎవడు సినిమాను తారక్ , కళ్యాణ్ రామ్ కలిసి చేద్దాం అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల చివరగా తారక్ ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడట. శ్రీమంతుడు సినిమా ఆఫర్ ను కూడా తారక్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఊపిరి సినిమాలో నాగార్జున , కార్తీ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ లో కార్తీ పాత్రకు మొదట తారక్ ను అనుకున్న ఆయన ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బ్రహ్మోత్సవం , నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా , శ్రీనివాస కళ్యాణం సినిమాలను కూడా తారక్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: