సినిమాలు రిలీజ్ అయ్యాక కచ్చితంగా హెచ్ డి ప్రింట్లలో పైరసీలు లీక్ అవుతూ ఉంటాయి. కొన్నేమో ఐ బొమ్మ,మూవీ రూల్స్ వంటి ఆన్లైన్ సైట్లోకి వచ్చి లీక్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న పుష్ప-3 సినిమా కూడా ఇప్పటికే పలు సైట్లలో సినిమా రిలీజ్ అయిన రోజే లీకైన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ సినిమా చూసిన చాలా మంది జనాలు షాక్ అయిపోతున్నారు. మరి ఇంతకీ పుష్ప-2 ఎక్కడ వస్తుందో ఇప్పుడు చూద్దాం.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-టు సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద తన వేట కొనసాగిస్తున్నాడు అల్లు అర్జున్..
ఇప్పటికే మొదటి రోజు 294 కోట్లను కలెక్ట్ చేసి ఇండియాలోనే ఫస్ట్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప -2 సినిమాకి అడగడుగునా అడ్డంకులే తగులుతున్నాయి. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా తగ్గేదేలే అన్నట్టు సినిమా రోజురోజుకీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఇప్పటికే మూడు రోజుల్లోనే 600 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆదివారం కావడంతో మరిన్ని కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఇంకా అఫీషియల్ లెక్కలు బయటికి రాకపోయినప్పటికీ ఆదివారం రోజు చాలామంది ఈ సినిమాను వీక్షించినట్టు తెలుస్తోంది . అయితే అలాంటి ఈ సినిమా విడుదలైన మొదటి రోజే హెచ్డి ప్రింట్లతో కొన్ని ఆన్లైన్ సైట్లలో లీక్ అయింది.
అయితే తాజాగా పుష్ప టు మూవీకి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్లో వస్తుంది. అయితే దీన్ని చూసి చాలా మంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అయితే యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు వర్షన్ కాదు. హిందీ వర్షన్ పుష్ప టు మూవీ యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం దీన్ని చూసి ఎంతోమంది షాక్ అవ్వడంతో దీనిపై పుష్ప టు చిత్ర యూనిట్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు చూడాల్సి ఉంది. అంతేకాదు పుష్ప టు సినిమా యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేసే వారిపై సైబర్ క్రైమ్ పోలీస్ కేసు పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది