టాలీవుడ్‌లో సంక్రాంతి మూడు సినిమాలు ఒక్కరి చేతికే చిక్కాయిగా... !
మన తెలుగు సినిమాకు అతిపెద్ద సినిమా పండుగ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కొత్త ఏడాది మొదటి పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పాలి. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో దసరా పెద్ద పండుగ సంక్రాంతికి ఎక్కువ సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే దసరాకు కూడా మంచి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఆనవాయితీగా నడుస్తూ వస్తోంది. టాలీవుడ్ లో గత సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం - వెంకటేష్ సైంధవ - నాగార్జున నా స్వామి రంగా తో పాటు హనుమన్ సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాలలో హనుమాన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అతిపెద్ద హిట్టయింది. ఇక రానున్న 2025 సంక్రాంతికి కూడా సాలిడ్ సినిమాలు మన స్టార్స్ నుంచి ప్యాకెడ్ గా ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ ... అలాగే వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మూడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే యుఎస్ మార్కెట్ లో ఈ మూడు సినిమాలు ఒకే డిస్టిబ్యూషన్ నుంచి రిలీజ్ అవుతుండటం విశేషం. గేమ్ ఛేంజర్ డాకు మహారాజ్ సినిమాలను తీసుకుంటున్నట్టు ఆల్రెడీ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు గతంలోనే కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్ గా ఇదే డిస్ట్రిబ్యూషన్ సంస్థ వెంకీ మామ - అనిల్ రావిపూడి సంక్రాంతి వస్తున్నాం కూడా రిలీజ్ అవుతున్నట్టు చేశారు. దీంతో సంక్రాంతి డ్రెస్ లో ఉన్న మూడు పెద్ద సినిమాలు ఒకే సంస్థ నుంచి యుఎస్ మార్కెట్లో రిలీజ్ అవుతుండటం విశేషం. ఇది ఇలా ఉంటే నైజాంలోనూ ఈ మూడు సినిమాలను దిల్ రాజు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇందులో గేమ్ ఛేంజర్ - సంక్రాంతికి వస్తున్నాం సొంత సినిమాలు కాగా .. బాలయ్య సినిమా హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది.