సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం పోకిరి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమాను చాలా మంది రిజెక్ట్ చేశారట. మరి ఈ మూవీ ని రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరో తెలుసుకుందాం.
ఈ సినిమా కథను పూరి జగన్నాథ్ మొదట రవితేజకు వినిపించాడట. కథ మొత్తం విన్న రవితేజ సినిమా స్టోరీ సూపర్ గా ఉంది. కానీ నేను ప్రస్తుతం వేరే సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమా ఆ సమయం లోనే ఉంది. కావున నేను ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో పూరి జగన్నాథ్ ఈ మూవీ కథను పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. ఈ సినిమా కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ సినిమా కథ బాగుంది చేద్దాం అన్నట్లు చెప్పాడట. కానీ ఆ తర్వాత పవన్ ఈ సినిమా చేయడం పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదట. దానితో పూరి జగన్నాథ్ ఈ మూవీ కథను మహేష్ బాబు కు వినిపించాడట.
ఇక మహేష్ బాబు కు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే సినిమా చేస్తాను అని అన్నాడట. దానితో పోకిరి అనే టైటిల్ తో ఈ మూవీ ని మొదలు పెట్టి పూర్తి చేశారట. ఇక భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా మహేష్ క్రేజ్ మరింతగా పెరగగా ... ఇలియానా కు ఈ సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది.